Andhra Pradesh: 40 ఏళ్ల బంధంలో విషాదం.. భార్య మైనపు బొమ్మతో భర్త సంతోషం..

Andhra Pradesh: తన భార్యపై ఆయనకు ఆపారమైన ప్రేమ.. 40 ఏళ్ళ దాంపత్య జీవితంలో భర్తకు వెన్నుదన్నుగా నిలిచినా..

Andhra Pradesh: 40 ఏళ్ల బంధంలో విషాదం.. భార్య మైనపు బొమ్మతో భర్త సంతోషం..

Updated on: Jan 29, 2022 | 11:36 PM

Andhra Pradesh: తన భార్యపై ఆయనకు ఆపారమైన ప్రేమ.. 40 ఏళ్ళ దాంపత్య జీవితంలో భర్తకు వెన్నుదన్నుగా నిలిచినా ఆమె ఆరోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందింది. కానీ కష్టసుఖాల్లో పాలుపంచుకున్న తనభార్య దూరమవడంతో అయన కొంత ఆందోళనకు గురైయ్యారు. కానీ అయన కుంగిపోకుండా నిత్యం తన భార్య స్మృతులను తలుచుకుంటూ జీవిస్తున్నాడు. అంతే కాదు ఆమె ప్రతిరూపాన్ని బొమ్మగా తయారు చేయించి ఆమె తన పక్కన ఉన్నట్టు తలచుకుంటూ గడిపేస్తున్న వ్యక్తి పై టివి 9 స్పెషల్ స్టోరీ ..

మండవ కుటుంబరావు విజయవాడలో సాధారణ ఎలక్ట్రీషన్ గా పని చేస్తున్న ఆయనకు 40ఏళ్ల క్రితం కాశీ అన్నపూర్ణతో వివాహం జరిగింది. అప్పటినుండి కుటుంబరావు, అన్నపూర్ణ సంతోషంగా ఒకరికొకరు అండగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి సస్య అనే కూతురు కూడా వుంది. అయితే అన్నపూర్ణను పెళ్లి చేసుకున్ననాటినుండి కుటుంబరావు అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రముఖ వ్యాపారిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. 40 ఏళ్ల దాంపత్య జీవితంలో ఎలాంటి మనస్పర్థలు లేకుండా జీవించడం, ప్రముఖ వ్యాపారిగా ఎదగడంతో తమ కూతురు సస్య అమెరికాలో స్థిరపడింది. అయితే సంతోషంగా ఉన్న కుటుంబలో ఏడాది క్రితం విషాదం చోటుచేసుకుంది.. అత్యంత ప్రేమగా చూసుకున్న తన భార్య అన్నపూర్ణ ఆనారోగ్యంతో మృతిచెందింది. దింతో కుంగిపోయిన భర్త కుటుంబరావు నిత్యం తన భార్యనే తలుచుకుంటూ జీవిస్తున్నాడు. అంతటితో ఆగకుండా ఆమె ప్రతిరూపాన్ని బొమ్మగా చేసి నిత్యం ఆమెను స్మరించుకుంటున్నాడు.

కాశీ అన్నపూర్ణ మృతి చెందడంతో కుటుంబరావు ప్రేమతో ఆమె మైనపు విగ్రహాన్ని చేయించి ఇంట్లో పెట్టుకున్నాడు. అంతేకాదు ప్రతి రోజు ఆమెకు ఇష్టమైన ఫలాలను పెట్టి దీపం వెలిగించిన తర్వాతే ఇంటి నుండి బయటకు వస్తాడు. ఆమెకు ఇష్టమైన చేపలు, బొమ్మలను అలంకరణగా ఏర్పాటు చేశాడు. ఆమె లేకపోయినా ఆమె ప్రతిరూపమైన బొమ్మను తయారు చేయించి తన ప్రేమను చూపుతున్నాడు కుటుంబరావు.

Also read:

Different Thieve: వాడో వెరైటీ దొంగ.. ఇంట్లో చొరబడతాడు.. ఇల్లంతా శుభ్రం చేసి వెళ్తాడు..!

Hyderabad: ‘నగరాన్ని డ్రగ్‌ ఫ్రీ జోన్‌గా మారుద్దాం’.. ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలకు మాదాపూర్ డీసీపీ సూచన.

Cheating: పెళ్లి పేరుతో ఘరానా మోసం.. ముక్కూ , మొఖం తెలియకుండానే 17 లక్షలు కొట్టేసిన వైనం..