Andhra Pradesh: గోదావరి నదిలో తెలియాడుతూ కనిపించిన వక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. షాకింగ్ వీడియో

|

Jun 13, 2024 | 12:49 PM

గోదావరి నదిలో.. ఏదో తెలియాడుతూ ఓ వస్తువు కొట్టుకోని పోతూ కనిపించింది.. చూసిన వారు అది మొదట ఏందో అనుకున్నారు.. అక్కడున్న వారి చూపు మరలా దాని మీదపడింది.. అది వస్తువు కాదు.. మనిషి అని గుర్తించారు.. వెంటనే పడవ వేసుకొని వెళ్లి..

Andhra Pradesh: గోదావరి నదిలో తెలియాడుతూ కనిపించిన వక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. షాకింగ్ వీడియో
Godavari River
Follow us on

గోదావరి నదిలో.. ఏదో తెలియాడుతూ ఓ వస్తువు కొట్టుకోని పోతూ కనిపించింది.. చూసిన వారు అది మొదట ఏందో అనుకున్నారు.. అక్కడున్న వారి చూపు మరలా దాని మీదపడింది.. అది వస్తువు కాదు.. మనిషి అని గుర్తించారు.. వెంటనే పడవ వేసుకొని వెళ్లి.. అతన్ని రక్షించి.. ఒడ్డుకు చేర్చారు.. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.. ఐ.పోలవరం మండలం మురమళ్ళ బ్రిడ్జి నుంచి ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి గోదావరిలో పడి కొట్టుకుపోతూ కనిపించాడు.. దీంతో స్థానికులు వెంటనే స్పందించి.. హుటాహుటిన వెళ్లి.. ఆ వ్యక్తిని రక్షించారు.

వీడియో చూడండి..

గోదావరిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని బోటు సహాయంతో వెళ్లి.. అతన్ని కాపాడారు. అతన్ని చూసిన వెంటనే నరేష్ అనే వ్యక్తితోపాటు మరో వ్యక్తి.. బోటులో వెళ్లి.. అతన్ని కాపాడారు.. నరేష్ నీటిలో దిగి.. కొట్టుకుపోతున్న వ్యక్తిని ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడాడు..

అయితే.. నీటిలో పడిన వ్యక్తి మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది.. ఇలా చేసి ఉంటాడని.. స్థానికులు వెల్లడించారు.

వ్యక్తిని కాపాడుతున్న ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..