Sankranti: సీఎం క్యాంప్ ఆఫీసులో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. గోపూజ చేసిన సీఎం జగన్- వైఎస్ భారతి

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతునాయి. తాడేపల్లిలోని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారిక నివాసంలో సంక్రాంతి వేడుకలు మరింత వైభవోపేతంగా జరుగాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో... సతీసమేతంగా పాల్గొన్నారు సీఎం జగన్‌.

Sankranti: సీఎం క్యాంప్ ఆఫీసులో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. గోపూజ చేసిన సీఎం జగన్- వైఎస్ భారతి
Cm Ys Jagan Mohan Reddy Ys Bharti Performed Gopuja

Edited By:

Updated on: Jan 16, 2024 | 1:16 PM

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతునాయి. తాడేపల్లిలోని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారిక నివాసంలో సంక్రాంతి వేడుకలు మరింత వైభవోపేతంగా జరుగాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో… సతీసమేతంగా పాల్గొన్నారు సీఎం జగన్‌.

పండుగ పూట తన నివాసానికి వచ్చే రైతులు, ప్రజలతో జగన్‌ సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈసారి ఆయన నివాసం ఆవరణలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి సెట్‌ వేసి మరీ, ఈ పండుగ సంబరాలు నిర్వహించడం విశేషం. వెంకటేశ్వర ఆలయం సెట్టు ఈసారి స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆ సెట్‌లో నెలకొల్సిన వెంకటేశ్వర స్వామికి సీఎం జగన్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంప్రదాయ దుస్తుల్లో భారతితో కలిసి భోగి మంటలు వెలిగించారు సీఎం వైఎస్ జగన్‌. అలా మొదలైన సంబరాలు.. ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా సాగాయి. దంపతులిద్దరూ కలిసి బసవన్నలకు సారె సమర్పించారు. అనంతరం గోపూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాంప్‌ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ప్రముఖ శాస్త్రీయ నృత్యకళాకారుల ప్రదర్శనలు తిలకించారు సీఎం దంపతులు. ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ఎడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో… తెలంగాణ కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం.

ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి. భోగిమంటల సాక్షిగా ప్రజలంతా భోగాభాగ్యాలతో.. సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ భోగిమంటల్లో చెడును దహనం చేసి.. సంతోష సంక్రాంతిని ఇంటింటా నింపుకోవాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ సంతోషంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…