తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం..! శ్రీవారి భక్తులతో తిరుపతి వస్తున్న బస్సు..

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు నుండి తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. 30 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారులు ఎక్కువగా ఉన్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు.

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం..! శ్రీవారి భక్తులతో తిరుపతి వస్తున్న బస్సు..
Bus

Updated on: May 12, 2025 | 7:01 AM

తిరుపతి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అగరాల హైవే రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడు తిరువన్నమలై నుంచి శ్రీవారి భక్తులుతో తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటినా ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. బాధాకరమైన విషయం ఏంటంటే.. గాయపడిన వారిలో చిన్నారులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్న వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి