VSP Employees Dharna :విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వద్ద ఐఎన్టియుసి ఆధ్వర్యంలో ధర్నా.. ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని డిమాండ్‌

విశాఖ గాజువాక స్టీల్‌ప్లాంట్‌ వద్ద ఐఎన్టియుసి ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులుధర్నా చేపట్టారు. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు పేరుతో పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని,... కార్పొరేట్‌కు అప్పగిస్తూ ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శరవేగంగా...

VSP Employees Dharna :విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వద్ద ఐఎన్టియుసి ఆధ్వర్యంలో ధర్నా.. ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని డిమాండ్‌

Updated on: Jan 29, 2021 | 2:30 PM

VSP Employees Dharna : విశాఖ గాజువాక స్టీల్‌ప్లాంట్‌ వద్ద ఐఎన్టియుసి ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులుధర్నా చేపట్టారు. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు పేరుతో పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని,… కార్పొరేట్‌కు అప్పగిస్తూ ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోందని ఉద్యోగులు ఆరోపించారు.  ఈ ధర్నాలో జాతీయ ఐఎన్టియుసి కార్యదర్శి  మంత్రి రాజశేఖర్ పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రభుత్వ రంగ పరిశ్రమ గానే కొనసాగాలని లేని పక్షంలో INTUC ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు. తమ యూనియన్ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు ప్రభుత్వం 10 శాతం షేర్లను అమ్ముతామంటేనే తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తు చేశారు.

ప్లాంట్ ని అమ్మాలని చూసినా, వాటాలు విక్రయించినా పోరాటానికి వెనకాడబోమని రాజశేఖర్ హెచ్చరించారు. ప్లాంట్ లో సుమారుగా 600 మంది జూనియర్ ట్రైనీలకు శిక్షణ పూర్తయిందని.. ఇప్పటికీ వారిని టెక్నీషియన్ గా ప్రమోషన్ ఇవ్వడలేని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: నేను ఏ తప్పు చేయలేదు సాక్షాధారాలతో విచారణకు హాజరవుతా.. టైం ఇవ్వండి : దీప్ సిద్ధూ