AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Gas: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఇక డెలివరీలకు ఓటీపీ అక్కర్లేదు.. టెన్షన్ తీరిపోయింది..

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు ఉపశమనం లభించింది. ఓటీపీ ధృవీకరణ నుంచి తాత్కాలికంగా ఉపశమనం కల్పించింది ప్రభుత్వం. తుఫాన్ క్రమంలో మొబైల్ టవర్లలో సాంకేతిక సమస్యలు, మొబైల్ సిగ్నల్స్ అందుబాటులో లేకపోవడంతో ఓటీపీలను అందుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఓటీపీ నిబంధనను తొలగించింది.

LPG Gas: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఇక డెలివరీలకు ఓటీపీ అక్కర్లేదు.. టెన్షన్ తీరిపోయింది..
Gas Cylinder
Venkatrao Lella
|

Updated on: Nov 03, 2026 | 7:23 AM

Share

అర్నబ్, మురసు వంటి వరుస తుఫాన్ల క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు భారీ ఊరట కలిగించింది. పశ్చిమాసియాలో యుద్ద పరిస్థితుల క్రమంలో గతంలో గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సిలిండర్ల డెలివరీకి ఓటీపీని తప్పనిసరి చేశాయి. గ్యాస్ బుకింగ్ చేసుకున్న తర్వాత డోర్ డెలివరీ చేసేటప్పుడు వినియోగదారుడి మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని డెలివరీ బాయ్‌కు చెప్పాల్సి ఉంటుంది. డెలివరీ బాయ్ యాప్‌లో ఓటీపీని ధృకరించుకున్న తర్వాత గ్యాస్ సిలిండర్ అందిస్తారు. గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా ఉండటం, నిజమైన వినియోగదారులకు మాత్రమే గ్యాస్ అందించడం, గ్యాస్ సరఫరా వ్యవస్థలో పారదర్శకత కోసం ఓటీపీ విధానాన్ని తప్పనిసరి చేశారు. ఓటీపీ ధృవీకరణ పూర్తి చేయకపోతే గ్యాస్ డెలివరీ చేసేవారు కాదు. అయితే ఏపీ ప్రభుత్వం తుఫాన్ క్రమంలో ఓటీపీ విధానానికి తాత్కాలికంగా స్వస్తి పలికింది.

ఈ జిల్లాల ప్రజలకు భారీ ఊరట..

తుఫాను ప్రభావం ఉన్న 13 జిల్లాల్లో గ్యాస్ సిలిండర్ల డెలివరీకి ఓటీపీ నిబంధనను తాత్కాలికంగా తొలగించింది. తుఫాన్ ప్రభావం, భారీ వర్షాల క్రమంలో మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు ఎదురవుతున్నాయి. సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఓటీపీలు అందుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో గ్యాస్ డెలివరీ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా ఓటీపీ నిబంధనల నుంచి ఉపశమనం కలిగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపిన అనంతరం దీని గురించి ప్రకటన జారీ చేసింది.

ఏయే జిల్లాల్లో అమల్లో ఉంటుందంటే..?

తుఫాన్ ప్రభావిత జిల్లాలైన ఏలూరు, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి మన్యం, అనకాపల్లి జిల్లాల్లో గ్యాస్ డెలివరీ ఓటీపీ ధృవీకరణ అక్కర్లేదని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఓటీపీలను పొందటంలో సాంకేతిక సమస్యలు నెలకొన్న క్రమంలో గ్యాస్ డెలివరీల్లో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం మినహాయింపు కల్పించింది. అలాగే నగదు చెల్లించి నేరుగా సిలిండర్లను పొందేందుకు కూడా అనుమతి జారీ చేసింది. అయితే కేవలం ప్రభుత్వం అనుమతి ఇచ్చిన జిల్లాల్లోనే ఇది అమల్లో ఉంటుంది. మిగతా జిల్లాల్లో యథావిధిగా ఓటీపీ ప్రక్రియ అమల్లో ఉంటుంది. దీనిని గ్యాస్ వినియోగదారులు గమనించాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో తుఫాప్  ప్రభావిత ప్రాంతాల్లో గ్యాస్ డెలివరీకి సంబంధించి ఓటీపీ సమస్యలు తీరిపోయాయి.

Follow Us