AP Rains: బాబోయ్.! ఏపీకి వాయు’గండం’.. ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన

|

Nov 21, 2024 | 7:00 AM

ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయా..? వాయుగుండం బలపడిన తర్వాత ఏఏ జిల్లాలపై ప్రభావం ఉంటుంది..? వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలేంటి..?

AP Rains: బాబోయ్.! ఏపీకి వాయుగండం.. ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన
Andhra Rains
Follow us on

ఏపీలోని పలు జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈనెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందన్నారు విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాస్. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడుతుందన్నారు.

ఇది చదవండి: తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా

ఇవి కూడా చదవండి

నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా శ్రీలంక, తమిళనాడు, కేరళ వైపు ప్రయాణిస్తుందన్నారు. వాయుగుండంగా బలపడిన తర్వాత దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాల ప్రభావం ఉంటుందన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని.. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. 26 నుంచి ఏపీపై వర్షాల ప్రభావం మూడు రోజుల పాటు ఉంటుందన్నారు. గత నెలలో బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్‌.. పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. లెటెస్ట్‌గా వాతావరణ శాఖ హెచ్చరికలతో పంటకు నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇది చదవండి: విశాఖలో ఉన్నట్టుండి వెనక్కి వెళ్లిన సముద్రం.. ఎన్ని మీటర్లో తెలిస్తే..

ఇది చదవండి: బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా..? తింటే ఇక పోతారు అంతే..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి