Andhra Pradesh: తిరుమల ఘాట్‌లో మళ్లీ చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు..

|

Jul 19, 2023 | 9:51 AM

TTD News: తిరుమల ఘాట్‌లో చిరుతపులి సంచారం భయపెడుతోంది. తరచూ భక్తుల కంట పడుతున్న చిరుత సంచారం అటు ఘాట్ రోడ్డులో ఇటు నడక దారిలో అప్పుడప్పుడూ కొనసాగుతూనే ఉంది. మొదటి ఘాట్‌లోనే చిరుత మూమెంట్ ఎక్కువగా ఉంది. అలిపిరి నడక దారి మొదటి ఘాట్ రోడ్డు చాలా చోట్ల కలిసిపోయే ప్రాంతాల్లోనే చిరుత క్రాసింగ్ అవుతుంది.

Andhra Pradesh: తిరుమల ఘాట్‌లో మళ్లీ చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు..
Leopard In Tirumala
Follow us on

Tirupati, July 19: తిరుమల ఘాట్‌లో చిరుతపులి సంచారం భయపెడుతోంది. తరచూ భక్తుల కంట పడుతున్న చిరుత సంచారం అటు ఘాట్ రోడ్డులో ఇటు నడక దారిలో అప్పుడప్పుడూ కొనసాగుతూనే ఉంది. మొదటి ఘాట్‌లోనే చిరుత మూమెంట్ ఎక్కువగా ఉంది. అలిపిరి నడక దారి మొదటి ఘాట్ రోడ్డు చాలా చోట్ల కలిసిపోయే ప్రాంతాల్లోనే చిరుత క్రాసింగ్ అవుతుంది. అదే చోట్ల భక్తులకు తారసపడుతోంది. మంగళవారం రాత్రి 33 వ మలుపు వద్ద చిరుత సంచారాన్ని గుర్తించిన భక్తులు.. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గత వారం కూడా తిరుమల జీఎన్సీ టోల్‌గేట్ సమీపంలోని 58 వ మలుపు వద్ద కూడా చిరుత సంచారం భక్తులను భయపెట్టింది. రాత్రి 9 గంటల సమయంలో చిరుత సంచారాన్ని గుర్తించిన టిటిడి విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై తిరుమల నుంచి తిరుపతికి బైక్‌పై ప్రయాణం చేసే భక్తులను ఆపి.. గుంపులు, గుంపులుగా పంపారు. అయితే, చిరుతపులి సంచారం.. నడకదారి, ఘాట్‌ రోడ్‌లో కామన్ అని చెబుతున్నారు ఫారెస్ట్ అధికారులు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, గుంపులు గుంపులుగానే భక్తులు వెళ్లాలని ఫారెస్ట్ సిబ్బంది, టీటీడీ అధికారులు భక్తులకు సూచిస్తున్నారు. అయితే, చిరుత సంచారంపై భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..