కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను కలిసిన రాయలసీమ ప్రాంత బీజేపీ నేతలు…ప్రత్యేక వినతిని ఆయన ముందుంచారు. రాయలసీమలో కరువుకాటకాలు, వెనుకబాటుతనాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. కరువు కాటకాలతో నిండిపోయిన రాయలసీమను దత్తత తీసుకోవాలని అమిత్ షాను కోరారు. అమిత్ షా రాయలసీమను దత్తత తీసుకుంటే ఆ ప్రాంతం అభివృద్ధి పథంలో పరుగులుపెడుతుందని వారు ఆశాభావం వ్యక్తంచేశారు. తమ వినతిపై అమిత్ షా సానుకూలంగా స్పందిస్తారని కర్నూలు జిల్లా బీజేపీ నేత అంబాల ప్రభాకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు.
మరి రాయలసీమ ప్రాంత బీజేపీ నేతల అభ్యర్థనపై అమిత్ షా ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. మొత్తానికి ఈ అంశం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. రాయలసీమను అమిత్ షా దత్తత తీసుకుంటే ఆ ప్రాంతంలో బీజేపీ రాజకీయంగా బలపడే అవకాశముంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
శ్రీశైలంలో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. Watch Video
Also Read..
లిప్ట్‌లో ఇరుక్కుపోయిన వరంగల్ మేయర్ గుండు సుధారాణి.. సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ముప్పు