
ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతం..వేదవతి నది ప్రవహించే పవిత్ర స్థలం. ఆ పవిత్ర ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న గ్రామం గూళ్యం. ఆ గ్రామంలో మనషుల రూపంలో అవధూతలుగా వెలసిన గాదిలింగేస్వార, సిద్ద లింగేశ్వర స్వామి వార్లు గురు శిష్యులు. వారు ఇద్దరు గొర్రెల కాపర్లు. నదిఒడ్డున ఇద్దరు ఉంటూ ఆ గ్రామంలోనే కాక సరిహద్దు కర్ణాటక లోని 20 గ్రామాల ప్రజలకు వారికి ఎన్నో మహిమలు చూపారు. దీంతో ప్రజలు వారిని దేవుళ్లగా పూజించారు.
కాలక్రమేణా వారి లో ఒకరైన శ్రీ గాది లింగేశ్వర స్వామి కి ఆయన నమ్మిన భక్తులు ఆలయం నిర్మించారు. భక్తితో పూజలు చేశారు. ప్రస్తుతం ఆలయంలో ఉన్న గాదిలింగేస్వార స్వామి భక్తుల కోర్కెలు తీరుస్తూ.. కొంగు బంగారం గా వరాలు ఇస్తు వస్తున్నారు. ఆయన పేరును గ్రామం లో ఉన్న ప్రతి ఇంటిలో పుట్టినవారికి గాది లింగా అనే నామకరణం చేయడం ఆనవాయితీగా మారింది. పేరులో ఎక్కడో ఒకచోట కచ్చితంగా ఆ పదం ఉండేలా చూసుకుంటారు. లేకపోతే అరిష్టం కలుగుతుందని వారి అనుమానం.
గ్రామంలో ఏదైనా శుభకర్యం జరిగిఆ, మరి ఏదైనా విషయం పై ప్రజలు గ్రామస్తులు గుమిగుడిన సందర్భాల్లో..గాది పేరు పిలిస్తే .. నన్నేనా పిలిచింది… అని పదుల సంఖ్యలో ప్రజలు వెనుకకు తిరిగి చూస్తారు. అంత ప్రాముఖ్యత ఉన్న పేరు స్వామి గాది లింగేస్వర కే దక్కింది. ప్రతి ఏటా గురు శిష్యులు శ్రీ గదిలింగేశ్వర సిద్ద లింగేశ్వర స్వామి వాళ్ళు కు జోడు రధోత్సవలు నిర్వహించడం అన వాయితీగా సంప్రదాయంగా వస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..