Vitamin B12 Defeciency: B 12 విటమిన్ పుష్కలంగా ఉండే ఈ 4 ఆకులు తిన్నారంటే.. శరీరానికి కావాల్సినంత బలం..
మీరు విటమిన్ బి12 లోపంతో బాధపడుతూ బలహీనంగా అనిపిస్తే, మనకు అందుబాటులో ఉండే, అతి చవకైన కొన్ని ఆకు కూరలు, ఆకులు ఉన్నాయి. ఇవి మీ శరీరంలో బీ-12 లోటును పూరించి మీ శరీరాన్ని పునరుజ్జీవింపజేయడంలో సహాయపడుతుంది. విటమిన్ బి12తో నిండిన ఆ ఆకులు ఏంటి..? వాటి పూర్తి ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..

శరీర నిర్మాణం కోసం ప్రతి ఒక్క పోషక పదార్ధం చాలా అవసరం. ఏ మాత్రం తక్కువైనా వివిధ రకాల వ్యాధుల ముప్పు ఉంటుంది. మన శరీరానికి ఎంతో అవసరమైన సూక్ష్మ పోషకం విటమిన్ బి- 12. మన శరీరం విటమిన్ బి- 12 ను సొంతంగా తయారు చేసుకోలేదు. ఆహార పదార్థాలనుంచి శరీరానికి ఈ విటమిన్ అందుతుంది. ఇది శాకాహార పదార్థాల నుంచి పెద్దగా లభించదు. అందుకే తీసుకునే డైట్ సరిగ్గా ఉండేట్టు చూసుకోవాలి. మీరు విటమిన్ బి12 లోపంతో బాధపడుతూ బలహీనంగా అనిపిస్తే, మనకు అందుబాటులో ఉండే, అతి చవకైన కొన్ని ఆకు కూరలు, ఆకులు ఉన్నాయి. ఇవి మీ శరీరంలో బీ-12 లోటును పూరించి మీ శరీరాన్ని పునరుజ్జీవింపజేయడంలో సహాయపడుతుంది. విటమిన్ బి12తో నిండిన ఆ ఆకులు ఏంటి..? వాటి పూర్తి ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..
విటమిన్ బి 12 లోపాన్ని ఎలా అధిగమించాలి
మునగ ఆకులు:
మోరింగ అని కూడా పిలువబడే మునగ ఆకులను పోషకాలకు శక్తి కేంద్రంగా పరిగణిస్తారు. ఈ ఆకులలో విటమిన్ ఎ, కాల్షియం, ఇనుము, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీర బలహీనత తొలగిపోతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ల కారణంగా రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
పాలకూర:
పాలకూర మీ ఆహారంలో ఇనుము కంటెంట్ కోసం మాత్రమే కాకుండా దాని విటమిన్ బి12 కోసం కూడా చేర్చుకోవాలి. ఇది ఇనుము, ఫోలేట్ మంచి మూలం కూడా. తరచూ పాలకూరను ఆహారంలో భాగంగా చేర్చుకోవటం వల్ల అలసట, నీరసాన్ని తొలగించి శరీరానికి శక్తిని ఇస్తుంది.
ఆవాల ఆకుకూర:
శీతాకాలంలో తినే ఆవాల ఆకుకూరలు చాలా పోషకమైనవి. విటమిన్ సి, విటమిన్ ఎ లతో సమృద్ధిగా ఉంటాయి. దీని రోజువారీ వినియోగం శరీరంలో విటమిన్ బి12 లోపాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.
కరివేపాకు:
పప్పు ధాన్యాలు, కూరగాయలు అన్నింటిలోనూ తప్పనిసరిగా ఉపయోగించే కరివేపాకు విటమిన్ బి12 కి మంచి మూలం. కరివేపాకులో ప్రోటీన్, కొవ్వు, కాల్షియం, ఇనుము, అలాగే విటమిన్ బి12 ఉంటాయి. ఇది చర్మం, జుట్టుకు చాలా ప్రయోజనకరంగా కూడా పరిగణిస్తారు.
విటమిన్ బి12 లోపం లక్షణాలు:
* చర్మం పసుపు రంగులోకి మారడం
* నాలుక ఎర్రగా మారడం
* నోటి పూత
* నడకలో తేడా, అయోమయం
* కళ్ళు సరిగ్గా కనపడకపోవడం
* చిరాకు, మొమరీ లాస్
* డిప్రెషన్, మలబద్ధకం, కాళ్లు చేతులు తిమ్మర్లు
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








