
ఈ మధ్య కాలంలో నేరాలు మరీ మితిమీరుతున్నాయి. చిన్న చిన్న విషయాలకు కూడా హత్యలు చేస్తున్నారు కొందరు. మరికొందరు రక్త సంబంధం కూడా మరిచి కౄరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటీ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణం లో దారుణం చోటుచేసుకుంది
వెలుగోడు పట్టణం సిపి నగర్ లో నివాసముంటున్న సిరివేరు రామకృష్ణ తనయుడు సిరి వేరు శ్రీనివాసులు చెడు వ్యసనాలకు చెడు తిరుగుళ్లకు అలవాటు పడి నిత్యం మద్యం సేవించి వచ్చి తన తండ్రితో గొడవపడేవాడు కొడుకుకు ఎన్నిసార్లు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ తనలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన తండ్రి నిన్న రాత్రి మద్యం సేవించి గొడవకు దిగిన కొడుకు శ్రీనివాసు పై కన్న మమకారాన్ని చంపుకొని కండువాతో గొంతు నిమిలి హత మార్చాడు
స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.