Kurnool District: అదృష్టమంటే ఇదే.. రాత్రికి రాత్రే లక్షాధికారి అయిన రైతు.. అసలేం జరిగిందంటే..?

| Edited By: శివలీల గోపి తుల్వా

Sep 17, 2023 | 8:23 AM

Kurnool District: జొన్నగిరి పెరవలి ప్రాంతాలలో ఎక్కువగా లభ్యం కావడంతో ఇప్పటికీ వజ్రాల అన్వేషకులు ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. దొరికిన వజ్రాలను జొన్నగిరి, గుత్తి,పెరవలి గ్రామానికి చెందిన వజ్రాల వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. కానీ దొరికిన వజ్రాలు ఎంత విలువ చేస్తాయి అన్న అవగాహన వజ్రాలు దొరికిన వారికి తెలియకపోవడంతో  వజ్రాల అన్వేషకులు, రైతులతో కూలీల నుంచి వజ్రాల వ్యాపారస్తులు తక్కువకే కొనుగోలు..

Kurnool District: అదృష్టమంటే ఇదే.. రాత్రికి రాత్రే లక్షాధికారి అయిన రైతు.. అసలేం జరిగిందంటే..?
Representative Image
Follow us on

కర్నూలు జిల్లా, సెప్టెంబర్ 17: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన రైతు పొలం పనులు చేస్తుండగా ఓ రాయి దొరకింది. దీంతో సదరు రైతు తనకు దొరికిన రాయిని ఇతరులకు చూపగా.. ఇది రాయి కాదు, వజ్రం అని చెప్పారు. ఇతరుల మాటలపై నమ్మలేని ఆ రైతు మద్దికేర మండలంలోని ఓ వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్లి చూపించగా ఇది వజ్రమేని చెప్పి, వజ్రం దొరికిన రైతుకు ఎనిమిది లక్షల రూపాయలు నగదుగా ఇచ్చి పంపారు. అయితే వజ్రం విలువ దాదాపు 55 లక్షలకు పైగా ఉంటుందని ఇతర వజ్రాల వ్యాపారస్తులు అనుకుంటున్నారు. పొలం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న రైతుకి వజ్రం దొరకడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మొగపిల్లలు ఉన్నారని వజ్రం అమ్మగా వచ్చిన డబ్బుతో పిల్లల్ని బాగా చదివించుకుని ప్రయోజకుల్ని చేస్తాను అంటున్నాడు ఆ రైతు.

అయితే ఈ సంవత్సరం వజ్రాలు దాదాపుగా జొన్నగిరి పెరవలి ప్రాంతాలలో ఎక్కువగా లభ్యం కావడంతో ఇప్పటికీ వజ్రాల అన్వేషకులు ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. దొరికిన వజ్రాలను జొన్నగిరి, గుత్తి,పెరవలి గ్రామానికి చెందిన వజ్రాల వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. కానీ దొరికిన వజ్రాలు ఎంత విలువ చేస్తాయి అన్న అవగాహన వజ్రాలు దొరికిన వారికి తెలియకపోవడంతో  వజ్రాల అన్వేషకులు, రైతులతో కూలీల నుంచి వజ్రాల వ్యాపారస్తులు తక్కువకే కొనుగోలు చేసి ప్రజలను మోసం చేస్తున్న రన్న ఆరోపణలు కూడా భారీగా ఉన్నాయి. అయితే వజ్రాల వ్యాపారస్తులు మాత్రం తాము ఎవ్వరిని మోసం చేయడం లేదని, వజ్రం ఎంత విలువ చేస్తుందో అంత డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తున్నామంటున్నారు.

కాగా, పత్తికొండ నియోజకవర్గ పరిధిలో వజ్రాల వ్యాపారం ఇంత జరుగుతున్నా ఏ అధికారులు కూడా ఏమి అనరా అంటే వారికి ముట్టేది ముడుతుంది అంటున్నారు వజ్రాల వ్యాపారులు. పత్తికొండ సబ్ డివిజన్లో మద్దికేర, తుగ్గలి, జొన్నగిరి  పోలీస్ స్టేషన్లో రెవెన్యూ అధికారులు ఉన్నప్పటికీ వజ్రాల వ్యాపారం జోరుగా సాగుతున్న ముట్టు ముట్టని లాగా ఉన్నారు. అయితే ప్రతి వజ్రం దొరికిన వెంటనే రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్లతో పాటు రాజకీయ నాయకులు కూడా మామూలు అందుతున్నాయని అందుకనే వజ్రాల వ్యాపారం గురించి ఎవ్వరూ ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని ప్రజలు అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..