Kurnool: పత్తికొండ టమోటా మార్కెట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే శ్రీదేవి.. రైతుల కంటతడి

|

Sep 04, 2021 | 8:58 AM

కర్నూలు జిల్లా పత్తికొండ టమోటా మార్కెట్‌ను ఎమ్మెల్యే శ్రీదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు తగిన గిట్టుబాటు ధర రాకపోవడంతో

Kurnool: పత్తికొండ టమోటా మార్కెట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే శ్రీదేవి.. రైతుల కంటతడి
Tomato
Follow us on

MLA Sridevi: కర్నూలు జిల్లా పత్తికొండ టమోటా మార్కెట్‌ను ఎమ్మెల్యే శ్రీదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు తగిన గిట్టుబాటు ధర రాకపోవడంతో వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర లభించేలా కొనుగోలు చేయాలని ఆదేశించారు. కిలో రూపాయి నుంచి రెండు రూపాయలు కూడా రావడం లేదని ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు.

దిగుబడి పెరగడంతో సప్లై పెరిగిందని తద్వారా డిమాండ్ తగ్గినట్లు వ్యాపారులు ఎమ్మెల్యేకి వివరించారు. అయినా కూడా తగిన గిట్టుబాటు ధర లభించేలా కొనుగోలు చేయాలని ఇలాగైతే రైతులు పండించే పరిస్థితులు కనుమరుగవుతాయి అని ఎమ్మెల్యే సూచించారు. పరిశీలిస్తామని ఎమ్మెల్యేకి వ్యాపారులు హామీ ఇచ్చారు. కాగా, ఎమ్మెల్యే శ్రీదేవి సమయం చిక్కినప్పుడల్లా ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం పరిపాటి.

మార్చి నెలలో గొర్రెల కాపరిలా మారిన ఎమ్మెల్యే శ్రీదేవి మేకల్ని ఎత్తుకొని గొర్రెల కాపరుల సమస్యలు అడిగి తెలుసుకున్న సంగతి తెలిసిందే. తాడికొండ మండలం దామరపల్లి గ్రామంలో ఓ దేవస్థానం కార్యక్రమానికి హాజరై వస్తున్న సమయంలో రోడ్డుపై భారీగా మేకలు కనిపించాయి. అంతే, ఠక్కున కారు ఆపించిన ఎమ్మెల్యే శ్రీదేవి గొర్రెలు, మేకలను ఎత్తుకొని కాసేపు గడిపారు.

Read also:  Rakul Preet Singh: డ్రగ్స్ కేసు విచారణలో రకుల్‌కు 7 గంటలపాటు ఈడీ సంధించిన ప్రశ్నలు.. రాబట్టిన సమాధానాలు?