Andhra Pradesh Politics: ఆసక్తి రేపుతున్న మంత్రాలయం రాజకీయాలు.. వైసీపీ నెక్ట్స్ ఎమ్మెల్యేగా అతనేనా?..

|

Jan 19, 2022 | 7:57 AM

Andhra Pradesh Politics: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున రానున్న ఎన్నికలలో పోటీ చేసేది..

Andhra Pradesh Politics: ఆసక్తి రేపుతున్న మంత్రాలయం రాజకీయాలు.. వైసీపీ నెక్ట్స్ ఎమ్మెల్యేగా అతనేనా?..
Follow us on

Andhra Pradesh Politics: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున రానున్న ఎన్నికలలో పోటీ చేసేది ఎవరు అనేదానిపై ఇప్పుడు జిల్లా రాజకీయాలలో హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రస్తుతం మంత్రాలయం ఎమ్మెల్యే గా బాల నాగిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఆయన మూడవసారి ఎమ్మెల్యే. మరోసారి బాలనాగిరెడ్డి పోటీ చేసేందుకు సుముఖంగా లేరు అని ఆయన కుటుంబం నుంచే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక పెద్ద సెంటిమెంట్ ఉన్నట్లు కుటుంబీకులు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలలో ఎక్కడా లేని విధంగా నలుగురు సోదరులు ప్రస్తుతం చట్టసభలలో ఉంటున్నారు.. వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామానికి చెందిన భీమిరెడ్డి మాజీ ఎమ్మెల్యే. భీమిరెడ్డి కి ఐదుగురు కుమారులు. ఇందులో నలుగురు కుమారులు ప్రస్తుతం చట్టసభలలో ఉండటం తెలుగు రాష్ట్రాలలోనే రికార్డ్ గా చెప్పుకుంటున్నారు.

బాల నాగిరెడ్డి మంత్రాలయం నుంచి, ఆదోని నుంచి సాయిప్రసాద్రెడ్డి, గుంతకల్ నుంచి వెంకట్ రామ్ రెడ్డి గత ఎన్నికలలో భారీ మెజారిటీతో ఎమ్మెల్యేలుగా గెలిచారు. మరో సోదరుడు మాజీ ఎమ్మెల్యే శివరాం రెడ్డికి ఇటీవలే ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి అవకాశం కల్పించారు. దీంతో ఒకే ఇంట్లో నలుగురు సోదరులు ఒకేసారి చట్టసభలలో కొనసాగుతూ ఉండటం తెలుగు రాష్ట్ర రాజకీయాలలో రికార్డ్ అని చెప్పుకోవాలి. మరో సోదరుడు సీతారామిరెడ్డి కూడా రాజకీయాలలో ఉన్నారు. మాజీ ఎంపీపీగా పని చేశారు. ఆయనను కూడా ఎమ్మెల్యే లేదా ఎంపీగా చూడాలనేది బాలనాగిరెడ్డి తల్లి, భీమిరెడ్డి సతీమణి కోరిక. ప్రస్తుతం ఆమె ఇంకా బతికే ఉన్నారు. దీంతో తల్లి కోరిక తీర్చేందుకు ఐదుగురు కొడుకులు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. అదెలాగంటే.. సీతారామిరెడ్డి కొడుకు ప్రదీప్ రెడ్డి మంత్రాలయం నియోజవర్గంలో ఆక్టివ్ గా తిరుగుతున్నాడు. మొత్తం నియోజకవర్గ బాధ్యతలు అన్నీ అతనే చూస్తున్నాడు. బాల నాగిరెడ్డి అధికారిక సమీక్షలు ఇతరత్ర సమావేశాలు తప్ప రాజకీయాలు మొత్తం ప్రదీప్ రెడ్డి చూస్తున్నాడు. బాల నాగిరెడ్డి పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా లేరు. పైగా తల్లి కోరికలు తీర్చాలి కాబట్టి సీతారామిరెడ్డి కొడుకు ప్రదీప్ రెడ్డి ని మంత్రాలయం నుంచి పోటీ చేయించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఐదుగురు కొడుకులను ఎమ్మెల్యేలుగా చూడాలని కోరుకుంటున్న తల్లి కోరికలు తీర్చవచ్చు అనేది ఐదుగురు సోదరుల అభిప్రాయంగా ఉంది.

సీతారామిరెడ్డి ఎమ్మెల్యేగా కాలేకపోయినప్పటికీ ఆయన కొడుకు ప్రదీప్ రెడ్డి ని ఎమ్మెల్యేగా చేయాలని తాపత్రయ పడుతున్నారు. ఇందులో భాగంగానే మంత్రాలయం నియోజకవర్గం మొత్తం ప్రదీప్ రెడ్డి చుట్టేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇందుకు అంగీకరిస్తారా లేదా అనేది, మాజీ ఎమ్మెల్యే భీమిరెడ్డి భార్య కోరిక నెరవేరుతుందా లేదా అనేది ఇప్పుడు కర్నూలు జిల్లా రాజకీయాలలో హాట్ టాపిక్ నడుస్తోంది. అయితే దీనిపై ఇంకా బాలనాగిరెడ్డి కుటుంబీకులు ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది.

నాగిరెడ్డి, టీవీ9 రిపోర్టర్, కర్నూలు

Also read:

Dhanush Aishwaryaa: ధనుష్, ఐశ్వర్య విడిపోవడానికి కారణం అదేనా.. ఫలించని రజినీకాంత్ ప్రయత్నం..

Khammam: విషాదం.. చిన్నారులు ఆడుకుంటుండగా కూలిన భారీ వృక్షం.. ఇద్దరు మృతి

Krithi Shetty: ఆ స్టార్ హీరో రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించుకున్న కృతి శెట్టి.. అతను ఎవరంటే..