Krithi Shetty: ఆ స్టార్ హీరో రాసిన లెటర్‌ను ఫ్రేమ్ కట్టించుకున్న కృతి శెట్టి.. అతను ఎవరంటే..
మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే భారీ హిట్
మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకోవడమే కాకుండా.. వరుస ఆఫర్స్ పటేస్తూ టాప్ హీరోయిన్ల జాబితాలో దూసుకుపోతుంది. కృతి శెట్టి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇటీవల శ్యామ్ సింగరాయ్ సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక సంక్రాంతి పండుగ రోజున బంగార్రాజుతో కలిసి థియేటర్లలో సందడి చేసింది కృతి. తాజాగా అలీతో సరదాగా షోకు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో కలిసి వచ్చిన కృతి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.
తాను మొదట యాడ్ షూట్స్ చేస్తూ నెమ్మదిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది కృతి శెట్టి. తన తొలి సినిమా ఉప్పెన సక్సెస్ ఎంతో ఆనందాన్నిచ్చిందని .. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి ప్రశంస ఎన్నటికీ మర్చిపోలేదని చెప్పుకొచ్చింది. ఉప్పెన ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన గురించి చిరంజీవి గారు మాట్లాడడం పెద్ద బహుమతిగా అనిపించిందని.. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మళ్లీ ఆయనొక గిఫ్ట పంపించారని తెలిపింది. తన చేతితో రాసిన ఓ లెటర్ , గిఫ్ట్ చిరంజీవి గారు పంపించారని… అందులో యూ ఆర్ ఏ బోర్న్ స్టార్ అని రాశారని… అందుకే ఆ లెటర్ ను ఫ్రేమ్ కట్టించి భద్రంగా దాచుకున్నానని తెలిపింది కృతి శెట్టి. పెద్ద స్టార్ హీరో మెచ్చుకొవడం గొప్పగా ఫీల్ అయ్యాయని చెప్పుకొచ్చింది కృతి శెట్టి. అంతేకాకుండా.. తనకు రామ్ చరణ్ అంటే ఇష్టమని.. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ నచ్చిందని.. అవకాశం దొరికితే ఆయనతో నటించాలని ఉందంటూ చెప్పుకొచ్చింది.
Sneha: సంక్రాంతి సంబరాల్లో హీరోయిన్ స్నేహ ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..