Kurnool: సర్కార్ ఆస్పత్రిలో వసూళ్ల దందా.. మగ పిల్లవాడు పుడితే 2000.. ఆడపిల్ల పుడితే 1000.. ఇవ్వకపోతే..

|

Nov 11, 2022 | 1:54 PM

జగన్ ప్రభుత్వం ఇన్ని పథకాలు తీసుకువచ్చి.. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతుంటే.. కొంతమంది సిబ్బంది మాత్రం ఆస్పత్రులకు వచ్చే పేదవారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.

Kurnool: సర్కార్ ఆస్పత్రిలో వసూళ్ల దందా.. మగ పిల్లవాడు పుడితే 2000.. ఆడపిల్ల పుడితే 1000.. ఇవ్వకపోతే..
Kurnool Government Hospital
Follow us on

అది కర్నూలు సర్కారీ ఆస్పత్రి. ప్రైవేట్ ఆస్పత్రులు వెళ్లలేని గరీబోళ్లు వచ్చి వైద్యం చేయించుకుంటారు. పేద వర్గాలకు ఆసరాగా ఉంటుందని.. ఆ ఆస్పత్రికి అన్ని సౌకర్యాలు అందిస్తుంది ప్రభుత్వం. కానీ అక్కడ పనిచేసే సిబ్బంది మాత్రం పేదవాళ్లను కూడా వదిలిపెట్టడం లేదు. గైనిగ్ వార్డులో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మగ పిల్లవాడు పుడితే 2000 రూపాయలు..  ఆడపిల్ల పుడితే వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎవరైనా ఇవ్వలేకపోతే.. వారి పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారు. చాన్నాళ్లుగా ఈ దందా సాగుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా కొందరు బాధితులు.. సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం కలెక్టర్‌ వరకు కూడా వెళ్లింది.

బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన సూపరింటెండెంట్‌ నరేందర్ నాథ్ రెడ్డి.. చర్యలు తీసుకుంటానని హామి ఇచ్చి.. లైట్ తీసుకోలేదు. వెంటనే ఇన్‌సైడ్ ఎంక్వైరీ చేయించారు. సిబ్బంది చేతివాటం నిజమేనని తేలడంతో వెంటనే యాక్షన్ తీసుకున్నారు. గైనిక్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న బాలు నాయక్, శంకర్‌లను విధుల నుంచి తొలగించారు. డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చినా, డబ్బులు ఇవ్వకుంటే పరీక్షల పేరుతో బయటకు టెస్టులు రాసిచ్చినా చర్యలు తప్పవని మిగిలిన వారికి వార్నింగ్ ఇచ్చారు.

ఏపీ ప్రభుత్వం పేదలకు అందించే వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇప్పటికే ఎన్నో స్కీములు తీసుకొచ్చింది. ఆరోగ్య శ్రీలో కూడా చికిత్స సంఖ్యను రోజురోజుకు పెంచుకుంటూ పోతుంది. అయినప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో.. సర్కార్ ఆస్పత్రులకు వెళ్లిన పేదవారికి కష్టాలు తప్పడం లేదు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం