తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆయనకు ప్రథమ చికిత్స అందించిన కేసీ ఆస్పత్రి వైద్యులు స్పందించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేరికి ఆయన స్పృహలో లేరని.. పల్స్ రేట్ కూడా తక్కువగా ఉందని తెలిపారు. వెంటనే సీపీఆర్ చేయడంతో పల్స్ మెరుగుపడిందని వెల్లడించారు. ఆపై కుటుంబ సభ్యుల కోరిక మేరకు.. వేరే ఆస్పత్రికి పంపామని వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
కాగా కుప్పం పీసీఎస్ ఆస్పత్రిలో తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. యాంజియోగ్రామ్ చేసిన వైద్యులు.. గుండెకు వెళ్లే రక్తనాళాల్లో బ్లాక్‌లు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. మార్నింగ్ ఆయన అస్వస్థతకు గురవ్వడానికి కారణం గుండెపోటే అని నిర్ధారించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. ప్రాణాపాయం తప్పినట్లు వైద్యలు తెలిపారు. తదుపరి వైద్య చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆస్పత్రిలోనే ఉండి.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు బాలయ్యకు ఫోన్ చేసి.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఎంక్వైరీ చేశారు. అవసరమైతే బెంగళూరుకు తరలించాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..