Chittoor District: కుప్పం మహిళా రైతుకు అరుదైన గౌరవం.. ఎర్రకోట పంద్రాగస్టు వేడుకలకు ఆహ్వానం

| Edited By: Ram Naramaneni

Aug 12, 2024 | 11:29 AM

ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర దిన వేడుకలకు రాష్ట్రం నుంచి పీఎం కిసాన్‌ లబ్ధిదారులైన నలుగురు రైతులను అతిథులుగా ఎంపిక చేశారు. వీరిలో చిత్తూరు ఉమ్మడి జిల్లా నుంచి మునిలక్ష్మి ఉన్నారు. మునిలక్ష్మి దంపతులు ఆదివారం సాయంత్రం కుప్పంనుంచి విజయవాడ బయలుదేరి వెళ్లారు. అక్కడ్నుంచి దురంతో ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి న్యూఢిల్లీ చేరుకుంటారు.

Chittoor District: కుప్పం మహిళా రైతుకు అరుదైన గౌరవం.. ఎర్రకోట పంద్రాగస్టు వేడుకలకు ఆహ్వానం
Munilakshmi - Narayana
Follow us on

చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన మహిళా రైతుకు అరుదైన అవకాశం దక్కింది. ఢిల్లీ ఎర్రకోటలో జరిగే పంద్రాగస్టు వేడుకలకు ఆహ్వానం అందింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అతిథిగా హాజరుకానుంది కుప్పం మహిళా రైతు మునిలక్ష్మీ. కుప్పం మండలం వెండుగాం పల్లిలో భర్త నారాయణతో కలిసి ఆదర్శ వ్యవసాయం చేస్తున్న మునిలక్ష్మికి ఈ గౌరవం దక్కింది. పిఎం కిసాన్ లబ్ధిదారురాలిగా ఉన్న మునిలక్ష్మి వ్యవసాయంలో రాణిస్తోంది. రాష్ట్రం నుంచి పీఎం కిసాన్ లబ్ధిదారులైన నలుగురు రైతులను ఎంపిక చేయగా.. అందులో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి వరలక్ష్మి, ఏలూరు నుంచి నాగమణి, శ్రీకాకుళం నుంచి దోమ మోహన్, ప్రకాశం నుంచి నల్లపు మాల్యాద్రి ఉన్నారు.

ఈ నెల 15 న ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కుప్పం నుంచి డిల్లీకి మునిలక్ష్మి, నారాయణ దంపతులు బయలుదేరారు. ఇప్పటికే అమరావతి చేరుకున్న ఆదర్శ రైతు మునిలక్ష్మి నేడు దురంతో ఎక్స్ ప్రెస్‌లో డిల్లీకి బయలుదేరుతోంది. అరుదైన గౌరవం దక్కిన మునిలక్ష్మీ దంపతులను కుప్పం టిడిపి నేతలు, స్థానికులు అభినందించి ఢిల్లీకి పంపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..