AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో శ్రీను.. బయట వాణి.. ఆస్పత్రిలో మాధురి.. కట్ చేస్తే, ఆమెకు అంతా దూరమయ్యారంటూ దువ్వాడ ఎమోషనల్..

ఇంట్లో శ్రీను.. బయట వాణి.. ఆస్పత్రిలో మాధురి.. ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం మరింత రచ్చకెక్కింది.. టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ఇంటి దగ్గర అదే టెన్షన్‌ కొనసాగుతోంది.. 5 రోజలుగా ఇంట్లోనే శ్రీను ఉండగా.. బయట భార్య వాణి, పిల్లలు నిరసన తెలుపుతున్నారు.. కూతురితో కలిసి కారు పార్కింగ్‌ షెడ్‌లో ఉంటూ వాణి ఆందోళన చేస్తున్నారు.

ఇంట్లో శ్రీను.. బయట వాణి.. ఆస్పత్రిలో మాధురి.. కట్ చేస్తే, ఆమెకు అంతా దూరమయ్యారంటూ దువ్వాడ ఎమోషనల్..
Duvvada Srinivas Family Controversy
Shaik Madar Saheb
|

Updated on: Aug 12, 2024 | 10:59 AM

Share

ఇంట్లో శ్రీను.. బయట వాణి.. ఆస్పత్రిలో మాధురి.. ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం మరింత రచ్చకెక్కింది.. టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ఇంటి దగ్గర అదే టెన్షన్‌ కొనసాగుతోంది.. 5 రోజలుగా ఇంట్లోనే శ్రీను ఉండగా.. బయట భార్య వాణి, పిల్లలు నిరసన తెలుపుతున్నారు.. కూతురితో కలిసి కారు పార్కింగ్‌ షెడ్‌లో ఉంటూ వాణి ఆందోళన చేస్తున్నారు. కాగా.. నిన్న పలాస దగ్గర కార్‌ యాక్సిడెంట్‌లో గాయాలపాలైన మాధురికి..విశాఖ అపోలో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.. ట్రోలింగ్స్‌ ఆపలేదనే ఆత్మహత్యాయత్నం చేశానని మాధురి పేర్కొన్నారు.. దువ్వాడ శ్రీను ఇంటిపై తనకూ హక్కుందని మాధురి పేర్కొన్నారు. ఇలా దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్‌లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు కొనసాగుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దువ్వాడ ఇంటి దగ్గర పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. మాధురికి కన్నవారు, అత్తగారు దూరమయ్యారని.. గతంలో మాధురి ఆత్మహత్యయత్నం చేసినపుడు తాను కాపాడి ధైర్యం చెప్పానని దువ్వాడ శ్రీనివాస్‌ తెలిపారు. వ్యక్తిత్వ హననం జరుగుతోందని మాధురి బాధపడిందని.. డిప్రెషన్‌లో ఎటు వెళుతున్నారో మాధురికి తెలియలేదని దువ్వాడ పేర్కొన్నారు. డిప్రెషన్‌ మూడ్‌ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆమె చెప్పిందని.. ఆమెది డ్రామా కాదు.. డ్రామా చేయాలనుకుంటే అది నిజమైతే ఏం జరిగి ఉండేది? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాధురి తలకు గాయమైంది.. ఆమకు CT స్కాన్‌ చేయాలి.. తలకు గాయమైతే ఏడాదిలో ఏమైనా జరగొచ్చని డాక్టర్లు చెప్పారన్నారు. వాస్తవానికి తాను ఆసుపత్రి వెళ్లాల్సి ఉందని.. వెళ్లలేకపోయానని పేర్కొన్నారు.

తాను ఎవరికీ భయపడనని.. నిర్మొహమాటంగా మాట్లాడతానని.. అందుకే తనకు శత్రువులు పెరిగారంటూ దువ్వాడ పేర్కొన్నారు. ఇలాంటి వ్యవహారంలో సమాజం భార్యవైపే మొగ్గుచూపుతుందని.. తన జీవితంలో ప్రతిక్షణం భార్య ద్వారా నరకం చూశానంటూ పేర్కొన్నారు.. భార్యాపిల్లలపై దాడిచేయాలన్నది తన ఉద్దేశం కాదన్నారు. తన భార్య వాణికి డైవర్స్‌ నోటీసు ఇచ్చానని.. దువ్వాడ శ్రీనివాస్‌ పేర్కొన్నారు.. మాధురిని చూసేందుకు ఆసుపత్రికి వెళితే.. ఇల్లు కబ్జా చేస్తారని దువ్వాడ పేర్కొన్నారు.

వీడియో చూడండి..