KRMB: ఏపీ-తెలంగాణ జలజగడం: NGT ఆదేశించింది. కమిటీ వచ్చింది. పనులను ఇవాళ పరిశీలించింది. ఇక్కడ ఇంట్రస్టింగ్‌ పాయింట్‌ ఏంటంటే..

|

Aug 11, 2021 | 9:17 PM

NGT ఆదేశించింది. కమిటీ వచ్చింది. పనులను చూసింది. ఇప్పుడా కమిటీ ఏమని నివేదిక ఇస్తుందనేదే ఇంట్రస్టింగ్‌ పాయింట్‌. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఉదయం నుంచి సాయంత్రం వరకు

KRMB: ఏపీ-తెలంగాణ జలజగడం: NGT ఆదేశించింది. కమిటీ వచ్చింది. పనులను ఇవాళ పరిశీలించింది. ఇక్కడ ఇంట్రస్టింగ్‌ పాయింట్‌ ఏంటంటే..
Rayalaseema Lift Irrigation
Follow us on

Krishna Water Dispute: NGT ఆదేశించింది. కమిటీ వచ్చింది. పనులను చూసింది. ఇప్పుడా కమిటీ ఏమని నివేదిక ఇస్తుందనేదే ఇంట్రస్టింగ్‌ పాయింట్‌. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిశీలన చేసింది KRMB కమిటీ. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ వైపు నుంచి అభ్యంతరాల నేపథ్యంలో ఆ పనులను ఇవాళ పరిశీలించింది కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు కమిటీ. పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలన్న నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల ప్రకారం ముగ్గురు సభ్యులు ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్‌లను పరిశీలించారు.

తుంగభద్ర బోర్డు చైర్మన్‌, కృష్ణా బోర్డు మెంబర్‌ సెక్రటరీ రాయ్‌ ఆధ్వర్యంలో కమిటీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాజెక్ట్‌ల దగ్గర పరిశీలన చేసింది. సీడబ్ల్యూసీ సభ్యులు మంతాంగ్‌, తల్వార్‌లు ఈ కమిటీలో ఉన్నారు. ఏపీ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి, CE మురళీనాధ్‌రెడ్డి కమిటీకి కావాల్సిన వివరాలను అందించారు. ప్లాన్‌ ప్రకారం పోతిరెడ్డిపాడుకు ఉదయమే కమిటీ రావాల్సి ఉంది. అనూహ్యంగా ముచ్చుమర్రికి వెళ్లి అధికారులతో భేటీ అయ్యారు సభ్యులు. సీమలో ప్రాజెక్ట్‌లు, శ్రీశైలంలో ఎన్ని అడుగులు ఉంటే నీళ్లు తీసుకోవచ్చన్న వివరాలను కమిటీకి వివరించారు ఏపీ అధికారులు.

సీమలో కరువు పరిస్థితులను ఫొటో ప్రజెంటేషన్‌ ద్వారా చూపించారు. ముచ్చుమర్రి నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణించి సాయంత్రం పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్‌ దగ్గరకు వెళ్లారు కమిటీ సభ్యులు. ప్రాజెక్ట్‌ను దాటుకుని లోపల వరకు వెళ్లి పరిశీలించారు. అక్కడ కొద్దిసేపు ఆగి వివరాలు తెలుసుకున్నారు. ఎల్లుండిలోగా NGTకి ఈ కమిటీ రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో నివేదికలో ఏయే అంశాలను రాస్తారన్నది ఆసక్తిగా మారింది.

Read also: Breaking: రేపు ఏపీకి రాబోతోన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఫ్యామిలీ సహా ఎక్కడకి వెళ్లబోతున్నారంటే..!