Krishna District: చేపల కోసం వల.. అబ్బా ఈరోజు పండుగే అనుకున్నాడు.. అంతలోనే షాక్

ఈ మధ్య చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు విచిత్ర అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో కూడా అలాంటి ఘటనే జరిగింది.

Krishna District: చేపల కోసం వల.. అబ్బా ఈరోజు పండుగే అనుకున్నాడు.. అంతలోనే షాక్
Python Caught

Updated on: Oct 18, 2021 | 10:24 AM

ఈ మధ్య చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు విచిత్ర అనుభవాలు ఎదురవుతున్నాయి. అసలే వర్షాకాలం.. అల్పపీడనాలు ప్రభావంతో వేటకు వెళ్లడమే చాలా కష్టతరంగా మారింది. తాజాగా కృష్ణా జిల్లాలో చేపల కోసం నదీ తీరంలో వల వేసిన జాలరి కంగుతిన్నాడు. వలలో కొండచిలువ పడింది. పెనమలూరు మండలం పెదపులిపాక కృష్ణా నది తీరం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..  చేపలు పట్టేందకు మత్స్యకారుడు తీరం వద్దకు  వెళ్లాడు. వల విసిరి.. కొన్ని నిమిషాల అనంతరం లాగుతుండగా.. బాగా బలంగా అనిపించింది. ఇంకేముంది భారీగా చేపలు పడ్డాయి అనుకున్నాడు. ఈ రోజు సిరుల పంటే అని మనసులో ఆనందపడ్డాడు. అయితే వల లాగుతోన్న కొద్దీ అతనికి ఏదో తేడా కొడుతున్నట్లు అనుమానం వచ్చింది. దీంతో త్వరత్వరగా వలను బయలకు లాగేసి.. చూసి కంగుతిన్నాడు. అందులో 15 అడుగుల పొడవున్న కొండచిలువ చిక్కింది. దాన్ని చూడగానే షాక్ తిన్న మత్సకారుడు.. తేరకుని వల నుంచి దాన్ని తప్పించేందుకు ప్రయత్నించాడు. అయితే ఫలితం దక్కలేదు. దీంతో సదరు మత్స్యకారుడు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పామును స్వాధీనం చేసుకున్నారు. దాన్ని అడవుల్లో విడిచిపెడతామని చెప్పారు. నదికి వస్తున్న వరదలకు ఎగువ భాగంలోని  అడవుల నుంచి కొండచిలువ కొట్టుకువచ్చి ఉంటుందని  అటవీ శాఖ సిబ్బంది భావిస్తున్నారు.

Also Read: పండక్కి అత్తగారింటకి వచ్చి బైక్స్‌కు ఫైన్ వేసిన ఎస్సై… గ్రామస్తులు ఏం చేశారంటే

‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమంలో పవన్‌ను పలకరించేందుకు మంచు విష్ణు యత్నం.. కానీ