Krishna District: ఆర్​ఎంపీ, పీఎంపీలకు కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ వార్నింగ్… క‌రోనాకు చికిత్స చేస్తే క్రిమిన‌ల్ కేసులు

కృష్ణా జిల్లాలో ఆర్​ఎంపీ, పీఎంపీలు కోవిడ్ చికిత్స చేస్తే.. భారత శిక్షాస్మృతి కోడ్ 1860 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.

Krishna District: ఆర్​ఎంపీ, పీఎంపీలకు కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ వార్నింగ్... క‌రోనాకు చికిత్స చేస్తే క్రిమిన‌ల్ కేసులు
Krishna District Collector
Follow us

|

Updated on: May 22, 2021 | 5:12 PM

కృష్ణా జిల్లాలో ఆర్​ఎంపీ, పీఎంపీలు కోవిడ్ చికిత్స చేస్తే.. భారత శిక్షాస్మృతి కోడ్ 1860 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్​ఎంపీ, పీఎంపీల‌కు కరోనాకు చికిత్స చేయ‌డానికి ఎపిడిమిక్ డీసీజస్ యాక్ట్ 1897, యాక్ట్ నెం.3 ఆఫ్ 1897 ప్రకారం అనుమతి లేదని స్పష్టం చేశారు. కోవిడ్ సంబంధిత లక్షణాలు బ్రాంకీయల్ ఆస్మా, ఎల్.వి.ఎఫ్, ఏఆర్డి, శారి, ఎక్యూట్ మమో కార్డియల్ ఇన్ఫెక్షన్.. ఇతర  ల‌క్ష‌ణాలు ఉంటే గుర్తింపు పొందిన ప్రభుత్వ ఆస్పత్రిలో, గుర్తింపు పొందిన ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రిలో మాత్రమే చికిత్స తీసుకోవాల‌న్నారు. ఈ క్ర‌మంలో ఆర్‌.ఎంపీలు, పీఎంపీలు కరోనా సోకిన‌వారికి వైద్యం చేయకుండా గుర్తింపు పొందిన ప్రభుత్వ ఆస్పత్రులకు, కోవిడ్ ప్రైవేట్ ఆస్పత్రులకు పంపించాలన్నారు. అలా కాకుండా కోవిడ్ చికిత్సకు పాల్పడితే భాద్యులపై క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుందని కలెక్టర్ ఇంతియాజ్ హెచ్చ‌రించారు.

గ్రామాల్లో మ‌రింత అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం..

గ్రామాల్లో ప్రజలు గుమికూడటం, బడ్డీకొట్ల వద్ద గుంపులుగా చేరడం చాలా డేంజ‌ర్ అని, తక్షణమే అటువంటివారిని నియంత్రించాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌… అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ తన క్యాంపు ఆఫీసు నుంచి మచిలీపట్నం డివిజన్‌ పరిధిలోని మొవ్వ, మోపిదేవి, అవనిగడ్డ అధికారులు, సర్పంచ్‌లతో జూమ్‌ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా రెండవ స్ట్రెయిన్ చాలా ప్రమాదకరంగా, ఆందోళన కలిగించేదిగా ఉందన్నారు. సిటీల కంటే, గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందన్నారు. ప్రజంట్ అమలు చేస్తున్న విధానాలను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసుకుని కార్యాచరణ అమలు చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో బ్లీచింగ్‌, సున్నం, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ద్రావణం పిచికారీ చేస్తున్నట్లు అధికారులు, సర్పంచ్‌లు తెలిపారన్నారు.

Also Read: రేపు కేంద్ర విద్యా శాఖ ఉన్న‌త స్థాయి స‌మావేశం.. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై చ‌ర్చ‌..

నీట్ కోచింగ్ కోసం ఆల‌యాల్లో దొంగ‌త‌నాలు.. అత‌డి వెర్ష‌న్ విని పోలీసుల మైండ్ బ్లాంక్