Kotappakonda Shrine: పల్నాడు సంస్కృతిలో.. కోటప్పకొండ తిరునాళ్ళకు ప్రభలు కట్టడం ఒక భాగం. అయితే గత కొన్నేళ్ళుగా వివిధ కారణాలతో ప్రభలు నిర్మించడం తగ్గిపోయింది. ఫ్లై ఓవర్ల నిర్మాణం, విద్యుత్ హైవోల్టేజ్ వైర్ల ఏర్పాటు చేయడంతో ప్రభల నిర్మాణం ఆగిపోయింది. మరోవైపు నిర్మాణ ఖర్చులు పెరిగిపోవడం, చదువుకున్న యువత ఉద్యోగాల నిమిత్తం పట్టణాలకు, నగరాలకు తరలిపోవడంతో కూడా ప్రభల నిర్మించడం కష్టసాధ్యంగా మారింది. చిలకలూరిపేట మండలం కోమటినేని వారి పాలెం గ్రామం కూడా అటువంటి గ్రామాల్లో ఒకటి. 30 ఏళ్ల క్రితం ఈ గ్రామం నుండి ప్రభను నిర్మించడం నిలిపి వేశారు.
అయితే ఈ ఏడాది వర్క్ ఫ్రం హోం పద్దతిలో ఉద్యోగం చేస్తున్న యువతులు ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం ఆగిపోయిన ప్రభ నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందుకోసం 3 లక్షల రూపాయల ఖర్చు అవుతాయని లెక్కలు వేశారు. డబ్బులిస్తే సరిపోదు.. ప్రభను కొండకు తరలించడానికి జనం కూడా కావాలని భావించి.. డబ్బులివ్వడంతో పాటు తామే ముందుండి ప్రభను కొండకు తరలిస్తామని యువతులు ముందుకొచ్చారు. దీంతో 30 ఏళ్ళ క్రితం ఆగిపోయిన ప్రభ నిర్మాణం మొదలైంది. యువతులు ముందు నిలువగా.. ప్రభ కొండకు తరలింది. అదే విధంగా కొండ నుండి తిరిగి యువతులే ముందుండి ప్రభను గ్రామానికి చేర్చారు. కాగా, తమ సాంస్కృతిలో భాగమైన ప్రభ తిరిగి మొదలుకావటంపై స్థానిక పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.
Also read:
Deepika Padukone: ఆ స్టార్ హీరో చెప్పిన మాటను లైఫ్‌లాంగ్ గుర్తుంచుకుంటానంటున్న బాలీవుడ్ పద్మావతి