Andhra: అడుసు తొక్కనేల.. కాలు కడగనేల.. ఎన్ని కష్టాలు వచ్చాయో చూడండి..

డ్రైవర్‌ రాయుడు హత్య కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన జనసేన మాజీ నేత కోట వినుత రహస్యంగా చెన్నై పోలీస్‌స్టేషన్‌లో హాజరవుతున్నారు. కోర్టు షరతుల ప్రకారం ప్రతిరోజూ ఉదయం 10లోపు సంతకం చేయాల్సి ఉండడంతో, క్యాప్‌-మాస్క్‌ ధరిస్తూ గుర్తుపట్టకుండా వెళ్తున్నారు... ..

Andhra: అడుసు తొక్కనేల.. కాలు కడగనేల.. ఎన్ని కష్టాలు వచ్చాయో చూడండి..
Kota Vinuta

Updated on: Aug 09, 2025 | 8:40 PM

డ్రైవర్‌ రాయుడు హత్య కేసులో ఇటీవలే బెయిల్‌పై విడుదలైన జనసేన మాజీ నేత కోట వినుతకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. హత్య కేసులో అరెస్ట్‌ అయిన వినుతకు చెన్నై సెష‌న్స్ కోర్టు ష‌ర‌తులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు షరతుల ప్రకారం… తాము అనుమతించే వరకు ప్రతి రోజూ ఉదయం 10 గంటలలోపు చెన్నైలోని సెవెన్ వెల్స్ పోలీస్‌ స్టేషన్‌లో హాజరై సంతకాలు చేయాలి.

ఈ క్రమంలో వినుత గత రెండు రోజులుగా రహస్యంగా చెన్నై వెళ్తున్నారు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు క్యాప్‌, ముఖానికి మాస్క్‌ ధరించి, తన లాయర్‌తో స్కూటీపై నిశ్శబ్దంగా ఆ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుంటున్నారు. అక్కడ సంతకం చేసిన వెంటనే ఎలాంటి ఆగిపోవడం లేకుండా తిరిగి బయలుదేరుతున్నారు.

గత నెల 7న డ్రైవర్‌ రాయుడు హత్య జరగ్గా, ఈ కేసులో కోట వినుత భర్త ఏ1గా, ఆమె ఏ3గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, వినుత బెయిల్‌ షరతులు, ఆమె జాగ్రత్తలు ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..