Watch: ఇది కదా పండగ అంటే.. పోలీసులకు రాఖీ కట్టిన హోంమంత్రి అనిత.. వీడయో వైరల్
దేశవ్యాప్తంగా రాఖీ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. అక్కాచెల్లెల్లు తమ సోదరులకు రాఖీ కడుతూ ప్రేమను చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ హోంమంత్రి అనిత డ్యూటీలో ఉన్న పోలీసులకు రాఖీ కట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. అక్కాచెల్లెల్లు, తమ సోదరులకు రాఖీ కట్టి తమకు జీవితాంతం రక్షగా ఉండమని కోరుకుంటున్నారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల బంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండగను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వినూత్నంగా జరుపుకున్నారు. ప్రజల శాంతిభద్రతతో నిత్యం బిజీగా ఉండే పోలీసులకు రాఖీ కట్టారు. అంతేకాకుండా విశాఖ ఎంవీపీ కాలనీ నుంచి ఉషోదయ జంక్షన్ వరకు ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా డ్రైవర్ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని.. రాఖీ కట్టారు. ఏకంగా హోంమంత్రి రాఖీ కట్టడంతో ఆ డ్రైవర్ ఎంతో సంతోషించాడు. ఆ తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న కానిస్టేబుల్ కొర్లయ్యను పరామర్శించారు. ఆయనకు రాఖీ కట్టి.. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత పలువురు పోలీస్ అధికారులకు ఆమె రాఖీ కట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆడపిల్ల పుడితే రూ.10 వేలు ఎఫ్డీ చేస్తా... సర్పంచ్ అభ్యర్థి హామీ
ఏంది సామీ ఇదీ.. నువ్వు నేతవా.. మాంత్రికుడివా
రోడ్డుపక్కన గుట్టలు గుట్టలుగా ఏటీఎం కార్డులు
ఈ కోతులు సల్లగుండా సర్పంచ్ ఎన్నికలనే మార్చేశాయిగా
ఫోన్ మాన్పించాలని చెస్ నేర్పితే.. చివరికి
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు

