Ambedkar Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామంలో వృద్ద గౌతమి నదీ తీరాన వెంచేసియున్న శ్రీశ్రీశ్రీ ఆర్ల అక్కమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు రెండు రోజులు పాటు ఘనంగా జరిగాయి. గండ్ర దీపాలతో ఊరంతా ఏకమై తమ మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. ఎక్కడ లేనివిధంగా ఊరు ఊరంతా దీపాలను తలపై పెట్టుకుని తీరగడం ఇక్కడి జాతర ప్రత్యేకత. ఇక ఈ జాతరను చూసేందుకు ఇతర జిల్లాలో తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలి వచ్చారు.
రెండు రోజులపాటు జరిగిన ఈ మహోత్సవాలలో భాగంగా జాతర, తీర్థం, గండ్ర దీపోత్సవం కార్యక్రమాలను భక్తులు నిర్వహించారు. అలాగే గ్రామ విధులలో అమ్మవారి గండ్ర దీపాలను భక్తులు తలపై పెట్టుకుని బాజా బజంత్రీలతో, శక్తి వేషధారణలతో, గరగ నృత్యాలతొ, బాణా సంచా కాల్పులతో బారీ ఉరేగింపుగా తరలి వచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. కోరుకున్న కొర్కెలు తీరతాయన్న నమ్మకంతొ సంవత్సరానికి ఒక్క సారి వచ్చే ఈ జాతరకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంక్యలో తరలి వచ్చి జాతర తిలకించి , గండ్ర దీపాల మొక్కులు చెల్లించుకున్నారని స్థానికులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..