మళ్లీ చాకిరేవు మొదలెట్టిన కొడాలి

వైఎస్ఆర్ సీపీ నేత, ఏపీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై మళ్లీ రెచ్చిపోయారు. చంద్రబాబునాయుడు, దేవినేని ఉమమీద కంబైండ్ గా తిట్లపురాణం అందుకున్నారు.

మళ్లీ చాకిరేవు మొదలెట్టిన కొడాలి
Anil kumar poka

|

Sep 04, 2020 | 4:39 PM

వైఎస్ఆర్ సీపీ నేత, ఏపీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై మళ్లీ రెచ్చిపోయారు. చంద్రబాబునాయుడు, దేవినేని ఉమమీద కంబైండ్ గా తిట్లపురాణం అందుకున్నారు. చంద్రబాబునాయుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించారు. చంద్రబాబు ఒక దళారి అని, రైతుల నుంచి తక్కువకు కొని హెరిటేజ్ లో అమ్ముకుంటుంటాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎన్నడూ వ్యవసాయం చేయలేదని, కేవలం బ్రోకర్ గా రైతుల పంటలను అమ్ముకోవడానికి దుకాణం పెట్టుకున్నాడని ఆయన అన్నారు. ఈ వయసులో కూడా చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని, వచ్చే ఎన్నికలనాటికి ఆయనకు 74 ఏళ్లు వస్తాయని, ఆ ఎన్నికలలో అన్ని ప్రీ అంటూ ప్రచారం చేస్తారని కొడాలి అన్నారు. చంద్రబాబుకి విజయవాడ వచ్చినట్లు లేదని, అంతరిక్షంలోకి వచ్చినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించిన దుర్మార్గుడు చంద్రబాబు.. ఆయన హయాంలో రైతులను మానసికంగా హింసించి ఇబ్బందులు పెట్టారని పేర్కొన్నారు. హుద్ హుద్ తుపానుకు ఎదురెళ్లానని చెప్పుకుంటున్న చంద్రబాబు కరోనాను చూసి ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు కరోనా నుంచి తప్పించుకోవడంపై దృష్టి పెట్టుకోవాలని, అంతే తప్ప తమ ముందుకొచ్చి చిటికెలు వేయడం మానుకోవాలన్నారు. తనను బూతుల మంత్రి అంటున్న చంద్రబాబు, దేవినేని ఉమ తాను బూతులు తిడితే బతికుంటారా? అంటూ వ్యాఖ్యానించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu