వీడియోలతో విరుచుకుపడ్డ చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వంపై మరో అస్త్రంతో ఆరోపణలకు దిగారు. ఆంధ్రప్రదేశ్ లో దళితులపై దాడులు కొనసాగుతున్నాయంటూ కృష్ణాజిల్లాలో తాజాగా జరిగిన ఒక ఘటనకు సంబంధించి వీడియో ఉంచి రెండు వరుస ట్వీట్లు చేశారు.

  • Anil kumar poka
  • Publish Date - 1:58 pm, Fri, 4 September 20
వీడియోలతో విరుచుకుపడ్డ చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వంపై మరో అస్త్రంతో ఆరోపణలకు దిగారు. ఆంధ్రప్రదేశ్ లో దళితులపై దాడులు కొనసాగుతున్నాయంటూ కృష్ణాజిల్లాలో తాజాగా జరిగిన ఒక ఘటనకు సంబంధించి వీడియో ఉంచి రెండు వరుస ట్వీట్లు చేశారు. ‘ఇది భయంకరమైనది.! దళితులపై దాడులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. కైకలూరు ప్రాంతంలోని ముదినేపల్లిలో మచా ధనలక్ష్మి ఇంటిని వైయస్ఆర్సీపి పార్టీ సభ్యులు కాల్చివేశారు. ఎందుకంటే ఆమె వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, కుటుంబ సభ్యులు ఆమె ప్రాణాల్ని రక్షించగలిగారు అంటూ చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలకు దిగారు. ఇంటిని తగులబెట్టిన ఈ ఘటనలో దురదృష్టవశాత్తు ధనలక్ష్మి ఇంటిలోని వస్తువులన్నీ బూడిద అయ్యాయని.. గత 15 నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో దళితులపై హింస తీవ్రస్థాయిలో పెరిగిపోయిందని చంద్రబాబు విమర్శించారు. అధికార పార్టీ సభ్యుల అహంకారం కారణంగా దాడులు జరుగుతున్నట్టు కనిపిస్తుందని చంద్రబాబు అన్నారు.