Kodali Nani: ప్లాన్‌ ప్రకారమే సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.. లోకేష్ సవాల్‌కు స్పందించం: కొడాలి నాని

|

Oct 20, 2021 | 7:00 PM

Kodali Nani comments on TDP: టీడీపీ అధికార ప్రతినిధి ప్లాన్‌ ప్రకారమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. సీఎం జగన్‌పై

Kodali Nani: ప్లాన్‌ ప్రకారమే సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.. లోకేష్ సవాల్‌కు స్పందించం: కొడాలి నాని
Kodali Nani
Follow us on

Kodali Nani comments on TDP: టీడీపీ అధికార ప్రతినిధి ప్లాన్‌ ప్రకారమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరూ ఊరుకోరంటూ హెచ్చరించారు. పట్టాభి డబ్బులు తీసుకునే తిడుతున్నాడని.. అతనఉ ఓ పేయిడ్ ఆర్టిస్ట్ అంటూ కొడాలి నాని విమర్శించారు. సీఎం జగన్‌ను ఎవరు ఏమన్నా వదిలిపెట్టమంటూ మంత్రి కొడాలి నాని లోకేష్‌, చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు. ప్లాన్‌ ప్రకారమే వైఎస్సార్సీపీ శ్రేణులను కావాలనే రెచ్చగొట్టారని నాని మండిపడ్డారు. చంద్రబాబువి మొదటి నుంచి మోసపూరిత రాజకీయాలే అంటూ నాని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబులాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా ఏం కాదని, సీఎం వైఎస్‌ జగన్‌ను ఇంచు కూడా కదిలించలేరంటూ చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు. చంద్రబాబులా పెయిడ్‌ ఆర్టిస్ట్‌లను పెట్టి తిట్టించడం తమకు రాదని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. వ్యూహం ప్రకారమే డ్రగ్స్‌పై టీడీపీ.. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అమిత్‌షాపై తిరుపతిలో చంద్రబాబు రాళ్లతో దాడి చేయించారని, చంద్రబాబు ఎలాంటి వ్యక్తో అమిత్‌షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకు తెలుసన్నారు.

ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని అమిత్‌షాను కలుస్తారంటూ చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు చేసే కొంగ జపాలను ఎవరూ నమ్మరంటూ నాని విమర్శించారు. దేశానికి మాదకద్రవ్యాలను సీఎం జగన్‌ సప్లై చేస్తున్నారని ప్రచారం చేసేందుకు టీడీపీ ప్రయత్నం చేసిందంటూ మండిపడ్డారు. టీడీపీ నాయకులు గత 10 రోజుల నుంచి తాడేపల్లి నుంచి గంజాయిని.. వైఎస్‌ జగన్ సరఫరా చేస్తున్నాడంటూ పిచ్చి వాగుడు వాగుతున్నారని పేర్కొన్నారు. పోసాని కృష్ణ మురళి ఇంటిపై దాడి చేస్తే పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్‌లో పడుకున్నాడు. ఇప్పుడు టీడీపీ ఆఫీస్‌లో రెండు కుర్చీలు ఇరగ్గానే ప్రజాస్వామ్యం ఖూనీ అంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ సూచించారు. లోకేష్ విసిరిన ఛాలెంజ్‌కు తాము స్పందించమని.. ఆయన జీవితంలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఛాలెంజ్ చేయాలంటూ కొడాలి నాని పేర్కొన్నారు.

Also Read:

Chandrababu Naidu: వేడెక్కుతున్న ఏపీ రాజకీయాలు.. ఢిల్లీకి చంద్రబాబు.. అమిత్‌ షాతో భేటీకి రెడీ..

Nara Lokesh: డ్రగ్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా ఏపీ.. టైం, ప్లేస్ చెప్పండి మేమే వస్తాం.. సీఎం జగన్‌పై నారా లోకేష్‌ ఫైర్‌