AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Atchannaidu: ఇవి బోగస్‌ పరిషత్‌ ఎన్నికల ఫలితాలు.. వైసీపీపై మండిపడ్డ అచ్చెన్నాయుడు

Atchannaidu: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ మాజీమంత్రి, శాసనసభ పక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు..

Atchannaidu: ఇవి బోగస్‌ పరిషత్‌ ఎన్నికల ఫలితాలు.. వైసీపీపై మండిపడ్డ అచ్చెన్నాయుడు
Kinjarapu Atchannaidu
Subhash Goud
|

Updated on: Sep 19, 2021 | 12:49 PM

Share

Atchannaidu: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ మాజీమంత్రి, శాసనసభ పక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలోఇవి బోగస్ పరిషత్ ఎన్నికల ఫలితాలు జరుగుతున్నాయని, టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరించిందని అన్నారు. ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ర్టంలో అడుగడుగునా చట్టాల ఉల్లంఘన, రాజ్యాంగ దిక్కరణ జరుగుతోంది. పంచాయితీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందో దేశం మొత్తం చూసింది. స్ధానిక ఎన్నికల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ అభ్యర్ధులపై దాడులు, దౌర్జన్యాలకు దిగి నామినేషన్లు కూడా వేయనీకుండా అడ్డుకుని పోలీసులు సాయంతో బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు. అధికారులు, పోలీసులు బరితెగించి అధికార పార్టీకి అన్ని విధాలా సహకరించి ప్రజాస్వామ్యాన్నికాల రాశారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఎన్నికల్లో వైసీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం వల్లే టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించిందన్నారు.

అడ్డదారుల్లో,అక్రమాల ద్వారా ప్రజాస్వామ్య కల్పవృక్షాన్నే కబళించే స్థాయిలో వైసీపీ నేతలు వ్యవహరించారని, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పాలైతే మంత్రులు నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్ళాల్సిందేనని, రాజకీయ భవిష్యత్ కోల్పోవాల్సి వస్తుందని జగన్ హెచ్చరించడంతో మంత్రులు, శాసనసభ్యులు, గ్రామాల మీద పడి దండయాత్ర చేశారన్నారు.

అధికార పక్షం సృష్టించిన అరాచకానికి, అడ్డంకుల మూలంగా ప్రతిపక్షం అనేక చోట్ల నామినేషన్స్ కూడా వేయలేక పోయిందని, మెజారిటీ స్థానాల్లో ఏకగ్రీవం చేసుకొనేందుకు అక్రమ కేసులు బనాయిస్తూ భయబ్రాంతులకు గురిచేశారన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా కనీ,విని ఎరుగని స్థాయిలో ఏకగ్రీవాలు చేసుకొన్నారని, ప్రజలను ఏం ఉద్దరించారని మీకు ఏకగ్రీవంగా పట్టం కడతారు ప్రశ్నించారు.

పుంగనూరులో 69 ఎంపీటీసీల్లో 65, తంబళపల్లిల్లో 72 కి 72 శ్రీకాళహస్తిలో 64 కి 63 ఎంపీటీసీలు వైసీపీ బలవంతంగా ఏకగ్రీవం చేసుకుందని దుయ్యబట్టారు. రాష్ర్టంలో మొత్తం ఈ విధంగా అరాచకం, దాడులు, దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేసుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నవారు ప్రజలకు తాము చేసింది ఏమిటో చెప్పుకొని ఓట్లు అడుగుతారు.. కానీ వైసీపీ నేతలు బెదిరింపులతో ఓటు వెయ్యకపోతే ఊళ్ళో ఉండరని, మీసంక్షేమ పథకాలు రద్దు చేస్తామని, మీ ఇళ్లు కూల్చేస్తామని, అక్రమ కేసులు బనాయిస్తామని అరాచకం సృష్టించి ఎన్నికల్లో గెలిచి ప్రజాస్వామ్య విలువలకు సిలువ వేశారన్నారు.

ఇవీ కూడా చదవండి:

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Bank Account Aadhaar Link: మీ ఆధార్‌ నెంబర్‌ ఏ బ్యాంకు ఖాతాకు లింక్‌ అయ్యిందో తెలుసుకోండిలా..!

Bank Balance: ఒకే రోజు కరోడ్‌పతి.. రైతు బ్యాంకు ఖాతాలో రూ.52 కోట్లు జమ.. షాకైన అధికారులు

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే