AP: మార్పులు చేర్పులు అనంతరం తొలిసారి ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..

|

May 12, 2022 | 9:34 PM

రాష్ట్రంలో రైతులు మూడు పంటలు పండించేలా చూసేందుకు వ్యవసాయ సీజన్‌ను ముందుగానే ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ నిర్ణయించింది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత జరిగిన తొలి కేబినెట్‌ భేటీలో ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది.

AP: మార్పులు చేర్పులు అనంతరం తొలిసారి ఏపీ కేబినెట్‌ భేటీ..  కీలక నిర్ణయాలు ఇవే..
Cm Jagan
Follow us on

AP Cabinet: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి(CM Jagan) అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేసిన తర్వాత జరిగిన మొదటి సమావేశమిది. ఈ ఏడాది వ్యవసాయ సీజన్‌ను ముందుగా ప్రారంభించాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జూన్‌ 1 నుంచి సాగునీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు పంటలు పండించేలా రైతులను సిద్ధం చేస్తామని కేబినెట్‌ వివరాలు వెల్లడిస్తూ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) తెలిపారు. పులిచింతల రిజర్వాయర్‌లో నీరు పుష్కలంగా ఉందని వెల్లడించారు. గ‌తంలో ప్రాజెక్టులు నిండాక ఆగ‌స్టులో నీరు విడుద‌ల చేసేవార‌ని, తాము మాత్రం ముందుగానే నీటిని విడుద‌ల చేయ‌నున్నామ‌ని అంబ‌టి స్పష్టం చేశారు. పెనుగొండ(Penugonda)లో పర్యాటకుల కోసం ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటుకు 40 ఎకరాలు భూమి కేటాయింపుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే నెల్లూరు జిల్లాలో టెక్స్‌టైల్‌ పార్క్ ఏర్పాటుకు కావాల్సిన భూమిని కేటాయింపునకు, రేపల్లెను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కేబినెట్‌ వివరాలు సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. చేపట్టబోయే సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు తెలిపారు.

కేబినెట్‌.. ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌పోర్ట్ పాలసీకి ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో బయోఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు ప్రతిపాదనకు అంగీకారం ప్రకటించింది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, రైతు బజారుల్లో మౌలిక సదుపాయాల కోసం 1600 కోట్ల రుణ సమీకరణకు కేబినెట్‌ మంజూరు తెలిపింది.

ఇవి కూడా చదవండి