Karthika masam: కోనసీమలో వనభోజనాల సందడి.. ఆత్మీయుల కలయికకు వేదికగా మారిన కార్తీక మాసం..

|

Nov 17, 2022 | 8:01 PM

ఆధ్యాత్మిక కేంద్రంగా సాంస్కృతిక కార్యక్రమాలతో విరాజిల్లుతున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.. వనభోజనాలతో వివిధ వర్గీయులు తమ ఆత్మీయులను, స్నేహితులను, సన్నిహితుల కలయికకు కేర్ ఆఫ్ గా మారింది కార్తీకమాసం..

Karthika masam: కోనసీమలో వనభోజనాల సందడి.. ఆత్మీయుల కలయికకు వేదికగా మారిన కార్తీక మాసం..
Karthika Maasa Vanabhojanam
Follow us on

కార్తీకం తెచ్చిన అపురూపమైన కలయిక.. కార్తీకమాసం అంటే ఉదయాన్నే లేచి శివుడికి పూజలు చేయడం దీపాలు వెలిగించడం ఇవే ఎక్కువగా అందరికి తెలిసిన విషయలు. అయితే విటన్నింటికంటే ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద బోజనాలు ఒకటి .. కార్తీకమాసంలో అయితే అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో కార్తీకమాసం కుటుంబ సభ్యులను, బంధు మిత్రులను అందరిని ఒకే చోట కలుపుతుంది. కార్తీకమాసం అందరినీ కలపడం ఏంటి అనుకుంటున్నారా అయితే ఆధ్యాత్మిక కేంద్రంగా సాంస్కృతిక కార్యక్రమాలతో విరాజిల్లుతున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కార్తీక మాసం వస్తే తెచ్చే సందడి గురించి తెలుసుకోవాల్సిందే. వనభోజనాలతో వివిధ వర్గీయులు తమ ఆత్మీయులను, స్నేహితులను, సన్నిహితుల కలయికకు కేర్ ఆఫ్ గా మారింది కార్తీకమాసం..

కార్తీకమాసం వన భోజనాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇంటి పేర్లు, కులాల పేర్లతో ఒక్కటవుతున్నరు. నల్లా, బండి ,దొమ్మేటి, బసవ, చోల్లంగి, రంకిరెడ్డి ఇలా ఇంటి పేర్లు అలాగే శెట్టిబలిజ, కాపు, దళిత, మత్యకార, రజక.. ఇలా అనేక ఇంటి పేర్లు, కులాల పేర్లతో కార్తీకమాస వన భోజనాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఒకే చోట కుటుంబ సభ్యులతో, సన్నిహితులు, స్నేహితులతో కలిసి ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి సంక్రాంతికి కుటుంబ సభ్యులతో కలిసి గడిపే జనం కార్తీకమాసం వస్తే మాత్రం కోనసీమలో కుటుంబ సభ్యులతో పాటు బంధు మిత్రులు అందరూ ఒకే చోట కలిసి భోజనలు చేసి పిల్లలు, పెద్దలు రోజంతా గడుపుతారు. ఇప్పుడు కార్తీకమాసం అంటే పూజలకే కాదు ఆత్మీయ కలయికకు వేదికగా కోనసీమ జిల్లాలో మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…