Kapu JAC Leader: కాపు ఉద్యమ జేఏసీ నాయకుడు ఆరేటి ప్రకాశ్ కుటుంబ వారసత్వ పాలనపై, పవన్ కల్యాణ ఆలోచనాతీరుపై హాట్ హాట్ కామెంట్స్ చేశారు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలోని లోపాలను పవన్ కళ్యాణ్ గుర్తించి.. వాటిని సరి చేసుకుని.. ప్రజల ముందుకు వచ్చి ఉంటే బాగుండేది అంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ 2019లో ఎన్నికలకు వెళ్లే ముందు సరైన నిర్ణయాలు తీసుకోలేదన్నారు. పవన్ కళ్యాణ్ సరైన కార్యచరణతో ఎన్నికల్లో ముందుకు వెళ్ళలేకపోవడం వల్ల ఫెయిల్ అయ్యారని చెప్పారు.
అయితే ఇప్పటికైనా పవన కళ్యాణ్ ప్రజల మధ్యకు రావాలని.. ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. కాపులలో మంచి నాయకులు ఉన్నారు…. అందరినీ కలుపుకొని మంచి ఫ్లాట్ ఫాం తయారు చేస్తామని తెలిపారు ఆరేటి ప్రకాష్. అసలే విభజన కష్టాలతో ఉన్న రాష్ట్రాన్ని ఎన్టీఆర్, రాజశేఖరరెడ్డి కుటుంబ వారసులు మరింత వెనక్కి తీసుకుపోతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఏపీలో కాపులు సంఖ్యాబలం ఎక్కువ.. అంతేకాదు కాపులు ఓటు బ్యాంకుగా పెద్ద శక్తి… అయినప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు కాపులను కరివేపాకులా తీసుకుని వదిలేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు కాపు ఉద్యమ జేఏసీ నాయకులు ఆరేటి ప్రకాశ్.
Also Read: మాకు స్వాతంత్య్రం వచ్చిందంటూ చెంగుచెంగున ఎగురుతున్న జింకలు.. నెట్టింట్లో వీడియో వైరల్..