Traffic Challan: వామ్మో.. చాంతాడంత చలానా లిస్టు! చూసి షాకైన ఏపీ పోలీసులు.. ఎక్కడంటే..?

|

Dec 29, 2021 | 6:23 PM

Traffic Challans: వాహనాలతో అడ్డదిడ్డంగా వెళ్లడం.. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకపోవడం.. చలానాలు కట్టకుండా తిరగడం లాంటి ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా.. ఒకటి, రెండు కాదు

Traffic Challan: వామ్మో.. చాంతాడంత చలానా లిస్టు! చూసి షాకైన ఏపీ పోలీసులు.. ఎక్కడంటే..?
Traffic Challan
Follow us on

Traffic Challans: వాహనాలతో అడ్డదిడ్డంగా వెళ్లడం.. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకపోవడం.. చలానాలు కట్టకుండా తిరగడం లాంటి ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా.. ఒకటి, రెండు కాదు ఏకంగా 25 పెండింగ్ చలానాలు కట్టకుండా తిరుగుతున్న ఓ వాహనదారుడు ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. చలానా లిస్ట్ తీస్తే చాంతాడంత రావడంతో వెంటనే కట్టాలని పోలీసులు ఆదేశించారు. దీంతో పెండింగ్‌లో ఉన్న ఐదు వేల రూపాయలు కట్టి వాహనదారుడు బండిని విడిపించుకున్నాడు. ఈ సంఘటన ఏపీలోని తూర్పుగోదావరి జల్లా కాకినాడలో చోటుచేసుకుంది.

ట్రాఫిక్ అధికారి ఆర్ఎస్ఐ ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మెయిన్ రోడ్డులో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ వాహనదారుడి బైక్ ఆపి రికార్డులు పరిశీలిస్తుండగా ఒకటి రెండు కాదు ఏకంగా 25 పెండింగ్ చలానాలు ఉండటాన్ని ఆర్ఎస్ఐ ఉదయభాస్కర్ గుర్తించారు. ఈ పెండింగ్ చలానాలకు ట్రాఫిక్ పోలీసులు ప్రింట్ కొట్టగానే రసీదుల మిషన్ నుంచి 15 అడుగుల పొడవుతో చలానాల లిస్ట్ వచ్చింది.

ఇంత పెద్ద లిస్టు ఆగకుండా రావడంతో అక్కడ ఉన్న స్థానికులు సైతం ఆశ్చర్యపోయారు. వాహనదారుడి నుంచి పెండింగ్ చలానాల ఫైన్ 5 వేల రూపాయలు వసూలు చేసి ఇంటికి పంపారు. అయితే.. ఇన్ని చలానాలు చెల్లించకుండా ఎలా తప్పించుకొని తిరుగుతున్నాడని స్థానికులు ఆశ్చర్యపోయారు. నాలుగైదు చలానాలకే పోలీసులు వాహనాలు సీజ్ చేస్తారు. కానీ పోలీసులు కళ్లుగప్పి 25 చలానాలు కట్టకుండా తిరుగుతున్నాడు వాహనదారుడు.

దీంతో అతనికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. పెండింగ్ చలానాలు ఉంటే చర్యలు తప్పవని ఎస్ఐ ఉదయభాస్కర్ హెచ్చరించారు. జిల్లా. ఎస్పీ రవీంద్రనాధ్ బాబు ఆదేశాల మేరకు పెండింగ్ చలానాల రికవరీ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Also Read:

New Year Celebrations: తగ్గేదెలే అంటే తాటతీస్తాం.. న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసుల వార్నింగ్

Watch Video: పార్లమెంట్‌లో రచ్చ రచ్చ.. ఒకరినొకరు కొట్టుకున్న జోర్డాన్‌ ఎంపీలు.. షాకింగ్‌ వీడియో