AP News: నారా లోకేష్‌ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం కుమార్తె కైవల్యారెడ్డి..!

|

May 28, 2022 | 1:45 PM

Andhrapradesh: ఏపీలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఇక అధికార వైసీపీకి నెల్లూరు జిల్లాలో భారీ షాక్..

AP News: నారా లోకేష్‌ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం కుమార్తె కైవల్యారెడ్డి..!
Breaking
Follow us on

Andhrapradesh: ఏపీలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి.  ఇక అధికార వైసీపీకి నెల్లూరు జిల్లాలో భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే త్వరలో కైవల్యారెడ్డి భర్త రితీష్ టీడీపీ నేత నారా లోకేష్‌తో భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒంగోలులో నారా లోకేష్‌ను కైవల్యారెడ్డి భేటీ అయ్యారు. టీడీపీ తరఫున కైవల్యారెడ్డి కుటుంబంలో ఒకరు పోటీ చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే దీనిపై ఆనం రామనారాయణ ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం కైవల్యా రెడ్డి తండ్రి రామనారాయణ రెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు అయితే కైవల్యా అత్తగారి ఊరు బద్వేలు నియోజకవర్గంలో ఉంది. అయితే తండ్రి వైసీపీలో ఉండటం.. కైవల్యా టీడీపీ చేరాలని చూడటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బద్వేల్ టీడీపీ మహిళా నేత విజయమ్మకు కోడలు కౌసల్యా రెడ్డి. త్వరలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి