Watch Video: అబ్బా.. ఏం వాడకమయ్యా.. రైతన్న తెలివికి సలాం కొట్టాల్సిందే!

కష్టపడి పని చేయలే గాని అనేక ఆలోచనలతో ముందుకు సాగిపోవచ్చు.. మనం చేసే వ్యవసాయ పనుల్లో కూడా కాస్త బుర్రకు పదును పెడితే కష్టమైన పనులను కూడా సాఫీగా సజావుగా కొనసాగించవచ్చు. ఇందుకు నిదర్శనమే మనం ఇప్పుడు తెలుసుకోబోయే విషయం. అదేంటో చూద్దాం పదండి.

Watch Video: అబ్బా.. ఏం వాడకమయ్యా.. రైతన్న తెలివికి సలాం కొట్టాల్సిందే!

Edited By:

Updated on: Dec 18, 2025 | 1:11 PM

కష్టపడి పని చేయలే గాని అనేక ఆలోచనలతో ముందుకు సాగిపోవచ్చు.. మనం చేసే వ్యవసాయ పనుల్లో కూడా కాస్త బుర్రకు పదును పెడితే కష్టమైన పనులను కూడా సాఫీగా సజావుగా కొనసాగించవచ్చని నిరూపించాడు ఓ రైతు. కలుపు మొక్కలు తీసే కూలీలకు డబ్బులు ఖర్చు అవుతున్నాయని.. తనకున్న బైక్‌తో పొలంలోని కలుపు మొక్కలను తీసే సరికొత్త ఉపాయాన్ని ఆలోచించాడు. కూలీలతో పనిలేకుండా తన బైక్‌తోనే ఈజీ కలుపు తీసుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం తిప్పలూరుకు చెందిన రాంభూపాల్ రెడ్డి అనే రైతు వినూత్న ఆలోచనతో తన పొలములోని కలుపు మొక్కలను తొలగించారు. ఇటీవల అధిక వర్షాల వలన పంట పొలాలలో కలుపు మొక్కలు విపరీతంగా పెరగడంతో రైతు కూలీలకు డబ్బులు చెల్లించలేక తన ద్విచక్ర వాహనానికి గుంటిక అనే పరికరాన్ని కట్టి కలుపు మొక్కలు తొలగించుకున్నాడు. తద్వారా తనకు కూలి డబ్బులు ఆదా అవుతాయి కాబట్టి కొంతమేర తానుపంట కోసం పెట్టిన పెట్టుబడిలో తనకు వచ్చే లాభంలో మరింత కూడగట్టుకునే ఆలోచన చేశారు.

గతంలో 10 ఎకరాలలో బుడ్డ సెనగ వేసి ఎకరాకు 15,000 చొప్పున ఖర్చు చేశానని.. అంతకు ముందు కూడా ఉల్లి పంట వేసి నష్టపోయానని అతను తెలిపాడు. ఇక నష్టపోయే ఆలోచన చేయలేదని అందుకే వ్యవసాయాన్ని కష్టంతో కాకుండా ఇష్టంతో చేస్తున్నానని ఆయన అన్నారు. ఏది ఏమైనా రైతు రాంభూపాల్ రెడ్డి చేసిన ఈ పనికి స్థానికంగా ఉన్న రైతులు హర్షం చేశారు .

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.