Andhra Pradesh: మూడోసారి కూడా ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు.. తమ డిమాండ్ నెరవేర్చే వరకూ ఇంతేనంటూ..

| Edited By: Surya Kala

Aug 19, 2023 | 1:28 PM

గతంలో ఉన్న రీతిలో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని అప్పట్లో ఆ గ్రామ ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. మరోసారి కూడా ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసినా  అప్పుడు కూడా బహిష్కరించి గ్రామస్తులు గ్రామ సభలను ఏర్పాటు చేశారు. తమ గ్రామాలను విలీనం చేయకుండానే గతంలో ఉన్నట్లుగానే యధావిధిగా ఎన్నికల నిర్వహించాలని తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించారు.

Andhra Pradesh:  మూడోసారి కూడా ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు.. తమ డిమాండ్ నెరవేర్చే వరకూ ఇంతేనంటూ..
Elections Boycotted In K.Sugumanchipalli
Follow us on

కడప న్యూస్, ఆగస్టు 18వ తేదీ: ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చనందుకు నిరసనగా వరుసగా మూడోసారి కూడా ఎన్నికలను బహిష్కరించారు ఆ గ్రామస్తులు. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా గ్రామపంచాయతీలను విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఇప్పటికే రెండుసార్లు ఎన్నికల్లో పాల్గొనని ఆ గ్రామం ఇప్పుడు ముచ్చటగా మూడోసారి  ఎన్నికలను బహిష్కరించారు. ఈరోజు జరుగుతున్న గ్రామ వార్డు, సర్పంచ్ ఎన్నికలను తిరస్కరించి తమకు న్యాయం చేయాలంటున్నారు ఏపీలోకి ఆ గ్రామస్తులు.. వివరాల్లోకి వెళ్తే..

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని కే. సుగుమంచిపల్లి గ్రామం ప్రజలు మాకు సపరేట్ గా  పంచాయతీ ఏర్పాటు చేసినప్పుడే ఎన్నికల్లో పాల్గొంటామని వారికి జరుగుతున్న సర్పంచ్ అలాగే 14 వార్డు నెంబర్లకు సంబంధించిన ఎన్నికలను బహిష్కరించారు. కొండాపురం మండలంలో నిర్మించిన గండికోట జలాశయం కింద కే సుగుమంచిపల్లి, దత్తాపురం, బుక్కపట్నం, జోగాపురం, బొమ్మ పల్లె, దొరుకుపల్లి ఓబన్నపేట , గండ్లూరు, చౌటుపల్లె తదితర గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఈ గ్రామాల్లోని ప్రజలను కేసుకు మంచి పల్లె గ్రామ సమీపంలో నిర్మించిన పునరావాస గ్రామాలకు తరలించారు.

గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఇవన్నీ కూడా జరిగాయి. గత ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పై గ్రామపంచాయతీలను విలీనం చేసి కే సుగుమంచిపల్లె గ్రామపంచాయతీ ఓపన్నపేట గ్రామపంచాయతీలుగా మార్పు చేసి సర్పంచ్ ఎన్నికలకు నాలుగు ఎంపీటీసీ స్థానాలు స్థానాలు ఉండగా మూడు ఎంపీటీసీ స్థానాలుగా మార్చి ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

గతంలో ఉన్న రీతిలో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని అప్పట్లో ఆ గ్రామ ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. మరోసారి కూడా ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసినా  అప్పుడు కూడా బహిష్కరించి గ్రామస్తులు గ్రామ సభలను ఏర్పాటు చేశారు. తమ గ్రామాలను విలీనం చేయకుండానే గతంలో ఉన్నట్లుగానే యధావిధిగా ఎన్నికల నిర్వహించాలని తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించారు. అయినప్పటికీ ఆ గ్రామాల్లో మళ్లీ అదే రీతిలో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్లు జారీ చేయడంతో అక్కడి ఓటర్లు నిరసిస్తున్నారు.  ఇప్పటికైనా తమ గ్రామాల్లో గతంలో నిర్వహించిన రీతిలో ఎన్నికలను నిర్వహించాలని అంతవరకూ తాము ఎన్నికల్లో పాల్గొనబోయేది లేదని మరోసారి తేల్చి చెప్పేశారు. ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో కూడా కే. సుగుమంచిపల్లి గ్రామస్తులు పాల్గొనడానికి ఇష్టపడలేదు. సరికదా కనీసం నామినేషన్ల దాఖలు గాని ఎటువంటి ఎన్నికల ప్రక్రియ గాని జరగలేదు నిర్వహించలేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..