AP Inter Exams: హాల్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే కాలేజీలపై కఠిన చర్యలు.. ఇంటర్ బోర్డు వార్నింగ్

|

Feb 17, 2023 | 9:37 AM

ఇంటర్మీడియట్‌ స్టూడెంట్స్‌కు ఎలాంటి ఇబ్బందులూ పెట్టకుండా కాలేజీల యాజమాన్యాలు హాల్‌టికెట్లు జారీ చేయాలని ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి శేషగిరిబాబు ఆదేశించారు.

AP Inter Exams: హాల్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే కాలేజీలపై కఠిన చర్యలు.. ఇంటర్ బోర్డు వార్నింగ్
Ap Inter Exams
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఎగ్జామ్స్‌కు రంగం సిద్దమైంది. గత 3 ఏళ్లుగా పరీక్షలు సరిగ్గా జరగడం లేదు. కరోనా కారణంగా రద్దు అవ్వడం.. పోస్ట్‌పోన్ అవ్వడం వంటివి జరిగాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ నిర్వహణ ఉండనుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఇటు స్టూడెంట్స్ అటు పేరెంట్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఎగ్జామ్స్ మార్చి 15న స్టార్ట్ అవుతాయి. సెకండియర్ పరీక్షలు మార్చి 16న ప్రారంభం కానున్నాయి. ఫస్టియర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 3న, సెకండియర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 4న ముగియనున్నాయి. ఈ క్రమంలో ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది.

రూల్స్ ప్రకారం హాజరు కలిగి ఉన్న స్టూడెంట్స్ అందరికీ.. హాల్ టికెట్లను ఇవ్వాలని కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు సూచించింది. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఏ కళాశాల/యాజమాన్యం హాల్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే స్టూడెంట్స్, పేరెంట్స్ తమని సంప్రదించాలని బోర్డు సూచించింది. ఇబ్బంది పెడితే టోల్‌ఫ్రీ నంబరు 18004257635కు ఫోన్‌ చేయాలని పేర్కొంది. అన్ని పనిదినాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు  కంట్రోల్‌ రూమ్‌కు సంప్రదించి కంప్లైంట్ చేయాలని సూచించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..