JC vs Kethireddy: తాడిపత్రిలో కొనసాగుతున్న టెన్షన్.. తగ్గేదీలే అంటున్న ఇద్దరు నేతలు..!

తాడిపత్రిలో టెన్షన్ వాతావరణ ఇప్పట్లో తగ్గేటట్లు కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజు, మరుసటి రోజు చెలరేగిన ఆర్లర్లతో జేసీ కుటుంబం, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో జేసీ, కేతిరెడ్డిలను తాడిపత్రికి వెళ్ళొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

JC vs Kethireddy: తాడిపత్రిలో కొనసాగుతున్న టెన్షన్.. తగ్గేదీలే అంటున్న ఇద్దరు నేతలు..!
Jc Vs Kethireddy
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 07, 2024 | 5:47 PM

తాడిపత్రిలో టెన్షన్ వాతావరణ ఇప్పట్లో తగ్గేటట్లు కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజు, మరుసటి రోజు చెలరేగిన ఆర్లర్లతో జేసీ కుటుంబం, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో జేసీ, కేతిరెడ్డిలను తాడిపత్రికి వెళ్ళొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ మరుసటి రోజు నుంచి ఈ రెండు కుటుంబాలు హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రిలోకి నో ఎంట్రీ బోర్డు పడింది. ఆఖరికి ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ అస్మిత్ రెడ్డి కూడా తాడిపత్రిలోకి వెళ్లలేని పరిస్థితి.

అసెంబ్లీ ఫలితాలు వెలువడిన నెల రోజుల తర్వాత ఎట్టకేలకు జేసీ కుటుంబం తాడిపత్రికి చేరుకుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరి మరణంతో జేసీ కుటుంబం తాడిపత్రిలోకి అడుగు పెట్టింది. తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ ఎంట్రీ తో.. ఇక మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీ ఎప్పుడు అనుకుంటున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇప్పటికే జేసీ కుటుంబం తాడిపత్రికి రావడం, ఇక పెద్దారెడ్డి కూడా కోర్టు ఆదేశాలు, ఆంక్షలు సడలిస్తే తాడిపత్రిలోకి వస్తే పరిస్థితి ఏంటి అని నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది

దాదాపు 45 రోజులు తర్వాత జేసీ కుటుంబ సభ్యులు తాడిపత్రిలో కాలు మోపారు. ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటన నేపథ్యంలో తాడిపత్రి వెళ్లకుండా ఆంక్షలు విధించింది హైకోర్టు. జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి లకు హైకోర్టు బెయిల్ పొడిగిస్తూ వచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు తాడిపత్రికి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించింది. దీంతో 45 రోజులపాటు తాడిపత్రి విడిచి ఈ రెండు కుటుంబాలు బయటే ఉంటున్నాయి. అయితే జూన్ నెల 30వ తేదీన జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరి సుజాత అకాల మరణంతో… జేసీ కుటుంబ సభ్యులు తాడిపత్రికి వచ్చారు.. జేసీ సోదరి సుజాత మరణానంతరం హిందూ సాంప్రదాయం ప్రకారం నిర్వహించవలసిన కార్యక్రమాలు ఉన్నందున హైకోర్టు జేసీ ప్రభాకర్ రెడ్డికి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి బెయిల్ పొడిగిస్తూ జూలై 14 వరకు తాడిపత్రిలో ఉండేందుకు ఆంక్షలు సడలించింది.

కారణాలు ఏమైతేనేం జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి ఎప్పుడు వస్తారు అన్న చర్చ జరుగుతుంది. ఒకవేళ హైకోర్టు జూలై 14న జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి లపై తాడిపత్రి రాకుండా ఉన్న ఆంక్షలు ఎత్తివేస్తే, కచ్చితంగా కేతిరెడ్డి పెద్దరెడ్డి తాడిపత్రిలో అడుగుపెడతారు. ఒకవేళ అదే జరిగితే మరలా తాడిపత్రిలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయన్నదీ టెన్షన్‌గా మారింది.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన అల్లర్లు చూస్తే తాడిపత్రిలో ఒక యుద్ధ వాతావరణం తలపించింది. టీడీపీ, వైసీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడం, పోలీసులు బాష్పవాయు ప్రయోగించడం, వందల సంఖ్యలో కేంద్ర బలగాలు తాడిపత్రిలో మోహరించి, పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించింది. ఆఖరికి జేసీ కుటుంబం, కేతిరెడ్డి కుటుంబం తాడిపత్రి విడిచి వెళితే గాని పరిస్థితి అదుపులోకి రాలేదు. వందల సంఖ్యలో టీడీపీ, వైసీపీ నాయకులు కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. వందల సంఖ్యలో రౌడీషీట్లు ఓపెన్ అయ్యాయి. ఇంకా అనేకమంది అల్లర్లలో పాల్గొన్నవారు పరారీలో ఉన్నారు. పోలీసులు వారి కోసం ఇప్పటికీ గాలింపు చేపట్టారు.

45 రోజులు పాటు నివురు గప్పిన నిప్పులా ఉన్న తాడిపత్రి.. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కోర్టు ఆదేశాలతో తాడిపత్రికి రావడంతో పోలీసులు ముందస్తుగానే అలెర్ట్ అయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. జూలై 14 వ తేదీ తర్వాత ఆంక్షలు సడలిస్తే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా తాడిపత్రికి వస్తే ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. దీంతో తాడిపత్రిలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం స్థానిక ప్రజల్లో ఇంకా కళ్ళ ముందు కదులుతూనే ఉంది. ఎన్నికల సందర్భంగా చెలరేగిన అల్లర్లు తాలూకా దృశ్యాలు వారి మదిలో మెదులుతూనే ఉంది. మొత్తం మీద తాడిపత్రిలో మంటలు ఇప్పట్లో చల్లారేటట్లు కనిపించడం లేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం