జనసేన(Janasena) పార్టీ నేతలు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ను కలవనున్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) నేతృత్వంలోని పార్టీ నాయకులు డీజీపీని కలవాలని నిర్ణయింటారు. ఈ మేరకు జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఆపాయింట్మెంట్ కోసం లేఖ రాశారు. తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై అక్రమంగా కేసులు పెడుతున్నారన్న అంశాలపై డీజీపీ కి ఫిర్యాదు చేయనున్నారు. ఇదిలా ఉండగా కోనసీమ(Konaseema) జిల్లాను అంబేడ్కర్ జిల్లాగా మార్చవద్దంటూ చేస్తున్న ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయి. నిరసనలు, ఆందోళనల నడుమ అమలాపురం అట్టుడికింది. అయినా శాంతించని నిరసనకారులు మంత్రి పినిపే విశ్వరూప్, స్థానిక ఎమ్మెల్యే ఇంటికి నిప్పంటించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. రాజకీయంగా పెను సంచలనం కలిగించింది. గత 50 ఏళ్లల్లో ఏనాడు కోనసీమలో ఇలాంటి ఘటనలు జరగలేదని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఈ ఘటన వెనుక టీడీపీ, జనసేన నాయకులు ఉన్నారని ఆరోపించారు.
ఈ ఆరోపణలపై పవన్ స్పందించారు. కొత్త జిల్లాలకు పేర్లు పెట్టినప్పుడే అంబేడ్కర్ పేరు కూడా పెడితే బాగుండేదని, అలా చేసి ఉంటే ఇప్పుడు అమలాపురం(Amalapuram) అగ్నిగుండంలా మారేది కాదని అన్నారు. ఎస్సీలలో బలం తగ్గుతోందన్న భావించి వైసీపీ(YCP) నేతలే ప్లాన్ చేసి గొడవలకు తెర లేపారని ఆరోపించారు. వారి మీద వారే దాడి చేయించుకుని సింపతీ కోసం చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ కుల రాజకీయం చేస్తోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. విభజన రాజకీయాలు చేసే ఇలాంటి పార్టీలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పవన్ సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి