Rapaka Vara Prasada: జనాగ్రహ దీక్షలో వైసీపీ కండువాతో జనసేన ఎమ్మెల్యే రాపాక.. వేటు వేస్తారా అంటూ .. ఫోటో వైరల్

|

Oct 22, 2021 | 7:28 AM

Rapaka Vara Prasada Rao: గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఒకేఒక్క స్థానాన్ని గెలుచుకుంది. రాజోలు నుంచి రాపాక వరప్రసాదరావు ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన వెంటనే.. తాను జనసేన..

Rapaka Vara Prasada: జనాగ్రహ దీక్షలో వైసీపీ కండువాతో జనసేన ఎమ్మెల్యే రాపాక.. వేటు వేస్తారా అంటూ .. ఫోటో వైరల్
Rapaka Mla
Follow us on

Rapaka Vara Prasada Rao: గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఒకేఒక్క స్థానాన్ని గెలుచుకుంది. రాజోలు నుంచి రాపాక వరప్రసాదరావు ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన వెంటనే.. తాను జనసేన పార్టీకి వీరవిదేయుడిని అని చెప్పిన రాపాక.. కాలక్రమంలో అధికార పార్టీ వైసిపీకి జంప్ అయ్యారు.. అయితే అధికారికంగా జనసేన పార్టీ.. మానసికంగా వైసిపీ అన్నట్లు ఉన్న గడుపుతున్నారు.. కానీ అధికారికంగా జనసేనకు గుడ్ బై చెప్పేసి.. వైసిపీ కండువా కప్పుకోలేదు ఇప్పటి వరకూ.. అలా చేరితే తము పార్టీ ఫిరాయింపు చట్టం కింద అనర్హతా వేటు వేసే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని సీఎం జగన్ తో పాటు స్పీకర్ తమ్మినేని సీతారం కూడా చాలా సార్లు చెప్పారు. ఇదే కారణంతో ప్రతి పక్ష ఎమ్మెల్యేలు వైసిపీ కండువా కప్పుకోలేదు.

రాపాక వరప్రసాద్ అధికారికంగా జనసేన పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. అయినప్పటికి వైసిపీ నేతలు చేపట్టే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూనే ఉన్నారు. ఈ నేపధ్యంలో వైసిపీ నేతలు చేపట్టిన జనాగ్రహ దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమంలో రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు. ఆ సమయంలో వైసిపీ పార్టీ కండువా కప్పుకున్నారు. వైసీపీ జెండా వేసుకుని మరీ ఇతర పార్టీలపై విమర్శలు చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పార్టీ ఫిరాయింపు చేశారు.. ఇదే ఆధారం.. అంటూ కామెంట్స్ జత చేస్తున్నారు. అంతేకాదు… పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే తాము ఫిరయింపులను ప్రోత్సహించమని చెప్పారు.. ఇప్పుడు రాపాక మీ పార్టీలో చేరకుండా జనసేన సేన ఎమ్మెల్యేగా కొనసాగుతూనే అధికార పార్టీ కండువా కప్పుకున్నారు.. మీ సమాధానం ఏమిటి.. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Also Read:  ఈరోజు ఈ రాశివారు కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశం.. ఏఏ రాశివారి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..