Pawan Kalyan: మంత్రి అంబటి ఇలాకాకు పవన్ కల్యాణ్.. హాట్ టాపిక్ గా మారిన కౌలు భరోసా.. వాట్ నెక్స్ట్..

|

Dec 18, 2022 | 9:21 AM

ఏపీ రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వైసీపీ, టీడీపీ నేతల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంటే.. వారికి దీటుగా జనసేన కూడా రాజకీయ రగడ పెంచుతోంది. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత పవన్...

Pawan Kalyan: మంత్రి అంబటి ఇలాకాకు పవన్ కల్యాణ్.. హాట్ టాపిక్ గా మారిన కౌలు భరోసా.. వాట్ నెక్స్ట్..
Pawan Kalyan
Follow us on

ఏపీ రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వైసీపీ, టీడీపీ నేతల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంటే.. వారికి దీటుగా జనసేన కూడా రాజకీయ రగడ పెంచుతోంది. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ ( ఆదివారం) సత్తెనపల్లిలో పర్యటించనున్నారు. కౌలు రైతు భరోసా యాత్రలో పాల్గొననున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు వివరాలు వెల్లడించారు. కౌలు భరోసా యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పవన్‌ కల్యాణ్‌ రూ.లక్ష చొప్పున రూ. 3 కోట్లు అందించనున్నారన్నారు. అనంతరం సత్తెనపల్లిలో పవన్ కల్యాణ్ సభలో పాల్గొంటారు. పార్టీలో చేరికలు ఉంటాయంటూ ప్రచారం పవన్ రాక నేపథ్యంలో పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 200 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. వీరి కుటుంబాలకు సత్తెనపల్లి వేదికగా జరిగే కార్యక్రమంలో ఆర్థికసాయం చెక్కులు అందించనున్నారు. సత్తెనపల్లి మంత్రి అంబటి రాంబాబు సొంత నియోజకవర్గం కావడం, అక్కడే పవన్ కల్యాణ్ కౌలు భరోసా యాత్ర చేపట్టడం గమనార్హం.

కాగా.. అప్పుల బాధ, సాగు నష్టాలతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్న రైతుల కుటుంబాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. దీంతో కౌలు రైతుల ఇబ్బందులు తెలుసుకుని వారిని ఆదుకోవడం కోసం జనసేన పార్టీ.. కౌలు భరోసా యాత్ర చేపట్టిందన్నారు. వైఎస్. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటివరకు రాష్ట్రంలో మూడు వేలకు పైగా రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. జనసేన సొంతంగా నిధులు సమీకరించి బాధిత కుటుంబాలకు ట్రస్ట్‌ ద్వారా సహాయమందిస్తోందని మనోహర్ స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

ఇవి కూడా చదవండి