Janasena: జనసేన అభ్యర్థి ఎవరైనా సరే.. నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేస్తానన్న ఎమ్మెల్యే రాపాక

|

Mar 12, 2023 | 2:21 PM

ఆలయ అధికారులు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా రాపాక వర ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తాను 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్.

Janasena: జనసేన అభ్యర్థి ఎవరైనా సరే..  నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేస్తానన్న ఎమ్మెల్యే రాపాక
Mla Rapaka
Follow us on

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జనసేన పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ ఈ రోజు తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారిని తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా రాపాక వర ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తాను 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్

2019 ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీలో ఆ పార్టీ తరపున ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలుపొందాడు. రాజోలు నియోజక వర్గం ఎమ్మెల్యేగా జనసేన తరపున విజయం సాధించారు రాపాక వర ప్రసాద్. అసెంబ్లీలో అడుగుపెట్టిన తొలి రోజు నుంచే రాపాక అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. అంతేకాదు సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలకు వంత పాడుతూ వచ్చారు. దీంతో జనసేన పార్టీ రాపాకను అసలు పట్టించుకోవడం లేదు.. ఇంకా చెప్పాలంటే అనధికారికంగా పార్టీనుంచి బహిష్కరించింది. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా రాపాక వరప్రసాద్‌కు మళ్లీ టికెట్ ఇచ్చే ఉద్దేశం కూడా జనసేన పార్టీ అగ్ర నాయకత్వానికి లేదు.. ఇదే సమయంలో తాను రూటు మార్చి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం రాజోలు నుంచే పోటీ చేయనున్నాని తేల్చి చెప్పేశారు. గతంలోనే రాజోలులో జనసేన పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే..  తాను పోటీ చేస్తానని, గెలుపోటములను ప్రజలే నిర్ణయిస్తారని రాపాక వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..