Nagababu: ఆంధ్రప్రదేశ్‌ను వారి నుంచి విముక్తి చేయాలి.. జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు..

|

Jun 26, 2022 | 5:27 AM

జనసేన సిద్ధాంతాలను ప్రజల్లో బలంగా ప్రచారం చేస్తూ, జనసేన గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్య కార్యకర్తలతో హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాయలంలో నాగబాబు శనివారం సమావేశమయ్యారు.

Nagababu: ఆంధ్రప్రదేశ్‌ను వారి నుంచి విముక్తి చేయాలి.. జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు..
Nagababu
Follow us on

janasena leader nagababu: జనసేన నేత నాగబాబు.. ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతిపరులు, దోపిడీదారుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి, భవిష్యత్తు తరాలను కాపాడుకోవటానికి జనసేనను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదంటూ జనసేన పీఏసీ సభ్యుడు కొణిదెల నాగబాబు పేర్కొన్నారు. జనసేన సిద్ధాంతాలను ప్రజల్లో బలంగా ప్రచారం చేస్తూ, జనసేన గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్య కార్యకర్తలతో హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాయలంలో నాగబాబు శనివారం సమావేశమయ్యారు. ఈమేరకు నాగబాబు ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.

ఏపీలో అమూల్యమైన వనరులు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో, ప్రజా ఆమోద పరిపాలన అందించడంలో అధికార వైసీపీ ప్రభుత్వం విఫలమైందని నాగబాబు ఆరోపించారు. దోపిడీకి గురవుతున్న రాష్ట్ర ఆర్థిక వనరులు, ప్రకృతి సంపదను కాపాడే సమర్థత జనసేనకు మాత్రమే ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి జనసేన దగ్గర వినూత్నమైన ప్రణాళికలు ఉన్నాయని, పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి అయ్యే వరకు తాను ఒక కార్యకర్తగా పనిచేస్తానంటూ నాగబాబు పేర్కొన్నారు.

రానున్న ఎన్నికలే లక్ష్యంగా గ్రామీణ స్థాయిలో విస్తరించి పనిచేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. జనసేన కార్యకర్తలంతా సమష్టిగా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా పలు అంశాలు, వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్ధేశం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..