Pawan Kalyan: శ్రీకాకుళంలో వలసలు ఆగాలని.. ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరగాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. సిక్కోలు తాలూకా ఉద్యమ స్ఫూర్తి మొత్తం రాష్ట్రానికి చూపించాలని తెలిపారు. విశాఖ ఉక్కు సాధించడం కోసం మళ్ళీ ప్రజలు నడుమ కట్టాలని కోరారు. విశాఖ ఉక్కు సాధించడం కోసం ప్రాణాలు త్యాగం చేసిన 32మంది అమరులను గుర్తు చేసుకోవాలని కోరారు. 25 ఏళ్ల ప్రస్థానం అని అంటే సుదీర్ఘ పోరాటమని తెలిపారు. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలని.. ఉద్దానంలో సమస్య తీరని కోరారు జనసేనాని. వైసీపీ ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసింది.. ఎక్కడో కొండల్లో ఇచ్చి మమ అన్నదన్నారు. శ్రీకాకుళంలో తిట్లి తుఫాను వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నపుడే ఇటువైపు చూడని వ్యక్తి.. ఇప్పుడు తుఫాన్ వస్తే.. ఎలా చూస్తారంటూ కామెంట్ చేశారు.
వైసీపీ నేతల మాటలకు వాగ్దానాలకు అర్ధాలు వేరని.. ఎవరైతే వైసీపీకి ఓట్లు చేశారో.. ఆ ప్రజలు స్థానిక వైసీపీ నేతలను ప్రశ్నిచాలని.. మీరు మా ప్రాంతం అభివృద్ధికోసం ఏమి చేశారని అడగాలని సూచించారు. ఇదే ఆముదాల వలసలో జనసైనికులు పెడితే.. స్వీకర్ ప్రారంభించడం ఏమిటి అని ప్రశ్నించారు పవన్. జనసైనికులు భయపడకుండా పనిచేయాలని..భయపడితే మార్పు రాదు. ఎవరైనా మిమ్మల్ని వేధిస్తుంటే.. అప్పుడు తగ్గి ఉండాలని.. గెరిల్లా హ్యూహంతో ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు చెప్పారు. వ్యూహాత్మకంగా వెనకడువేయాలని.. పిరికితనంతో వెనకడుగు వేయవద్దని సూచించారు పవన్.
అభివృద్ధి చెందాలంటే.. ప్రభుత్వ, ప్రయివేట్ పరిశ్రమలుండాలని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి పక్కపక్కనే ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సి వస్తే.. తాను ప్రజల పక్షానే పోరాడతానని .. అంతేకాని నాయకుల పక్కన ఉండనని.. చెప్పారు. పరిశ్రమలు రావాలని.. కాలుష్యం తగ్గించి.. పరిశ్రమలను నెలకొల్పేవిధంగా ప్రణాళికలు ఉండాలని చెప్పారు. దేశంలో ఎక్కడైనా శ్రీకాకుళం ప్రజలు కార్మికులుగా ఉన్నారని.. ఆ వలసలు ఆగాలని చెప్పారు.
Also Read: లోకకంఠకుడిగా మారితే.. కొడుకైనా సరే వధించక తప్పదని తెలిపే కథ.. నరకాసుర వధ