Pawan Kalyan: కౌలు రైతుల కోసం పవన్ కల్యాణ్ భరోసా యాత్ర.. ఎక్కడ నుంచి మొదలవుతుందంటే..?

ఏపీలోని జగన్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని జనసేన నేత నాదేండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు భరోసా కల్పించలేక పోగా ప్రభుత్వమే భీమా పథకాన్ని స్కామ్‌గా మార్చేసిందని ఆరోపించారు.

Pawan Kalyan: కౌలు రైతుల కోసం పవన్ కల్యాణ్ భరోసా యాత్ర.. ఎక్కడ నుంచి మొదలవుతుందంటే..?
Pawan Kalyan

Updated on: Jun 16, 2022 | 5:52 PM

Janasena Kaulu Rythu Bharosa Yatra: రైతుల కుటుంబాలను పరామర్శించడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర చేస్తున్నారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 19 తేదిన కౌలు రైతు భరోసా యాత్ర బాపట్ల జిల్లా పర్చూరు నుంచి యాత్ర ప్రారంభమవుతుందని మనోహర్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో 76 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏపీలోని జగన్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు భరోసా కల్పించలేక పోగా ప్రభుత్వమే భీమా పథకాన్ని స్కామ్‌గా మార్చేసిందని ఆరోపించారు. సీఎం వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు రైతులపై పరిజ్ఞానం లేదనుకుంటున్నానన్నారు. సాగు కోసం కౌలు రైతులు పడుతున్న కష్టాలను సీఎం గుర్తించలేకపోతున్నారని వివరించారు.

గుంటూరు జిల్లాలో 53 000 మంది కౌలు రైతులు ఉన్నారని మనోహర్ పేర్కొన్నారు. వారానికి ఐదారుగురు కౌలు రైతులు పల్నాడులో ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతు భరోసాకు కేంద్రం నిధులిస్తుందని వాటిని ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యక్రమాన్ని సీఎంనే స్వయంగా అభినందించాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు కూడా చెల్లించడం లేదని.. అగ్ర కులాలకు చెందిన వారంటూ రైతులకు రైతు భరోసా ఇవ్వటం లేదని మనోహర్ ఆరోపించారు.

ప్రత్యేక హోదా కాకపోతే ప్రత్యేక నిధులు కేటాయించాలని మనోహర్ డిమాండ్ చేశారు. అమరావతే రాజధానే అన్న విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పాలని కోరామని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని కేంద్రానికి చెప్పామని తెలిపారు. అమలాపురం ఘటనపై అమిత్ షాకు లేఖ రాశామని మనోహర్ వివరించారు. సీఎం అబద్ధాలు చెప్పినందుకు క్షమాపణ చెప్పాలని మనోహర్ డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

Nadendla Manohar

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..