Pawan Kalyan: జనసేన (Janasena) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధప్రదేశ్‌లోని (AndhraPradesh) కౌలు రైతులకు అండగా చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరగనున్నది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓర్వకల్లులోని విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రచ్చబండ కార్యక్రమం కోసం ఆళ్లగడ్డ నియోజకవర్గం, శిరివెళ్ళ గ్రామానికి బయలుదేరారు. మార్గం మధ్యలో ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిన నాలుగు కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి, పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సాయం అందచేస్తారు.
అంతకు ముందు జిల్లా పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ కి విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ నాయకులు చింతా సురేష్, రేఖా గౌడ్, హసీనా బేగం, అర్షద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, అనంతపురం జిల్లా నాయకుడు పెండ్యాల హరి తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా శిరివెళ్ళ పవన్ కళ్యాణ్ బయలు దేరారు.
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..