Pawan Kalyan: 28 మంది వైసిపీ ఎంపీలు విఫలం.. పోలవరం ఎప్పటికి పూర్తి అవుతుందో అంచనాలకు అందడం లేదన్న జనసేనాని

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిధుల సాధనలో ఎందుకింత అలసత్వం ప్రదర్శిస్తున్నారు. జనసేన(జనసేన) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) . 28 మంది ఎంపీలతో వైసీపీ ప్రభుత్వం

Pawan Kalyan:  28 మంది వైసిపీ ఎంపీలు విఫలం.. పోలవరం ఎప్పటికి పూర్తి అవుతుందో అంచనాలకు అందడం లేదన్న జనసేనాని
Pawan Kalyan On Polavaram
Follow us
Surya Kala

|

Updated on: Feb 02, 2022 | 10:01 PM

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పోలవరం ప్రాజెక్ట్(Polavaram Project) నిధుల సాధనలో ఎందుకింత అలసత్వం ప్రదర్శిస్తున్నారు జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) . 28 మంది ఎంపీలతో వైసీపీ ప్రభుత్వం సాధించింది శూన్యమని.. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి జాతీయ ప్రాజెక్ట్ హోదా ఉన్న పోలవరానికి 2022-23 బడ్జెట్లో కేటాయింపులు ఎక్కడ అంటూ ఆయన ప్రశ్నించారు.  22మంది వైసీపీ ఎంపీలు, ఆరుగురు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఢిల్లీలో ఏం సాధించినట్లని నిలదీశారు. ఈ పరిస్థితి చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద పోలవరం ప్రాజెక్ట్ గురించి కనీసం ప్రస్తావిస్తున్నారా లేదా అనే సందేహం కలుగుతోంది అంటూ జనసేనాని సోషల్ మీడియా వేదికగా వైసీపీ సర్కార్ పై అనేక ప్రశ్నల వర్షం కురిపించారు.

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రకటన సమయంలో పోలవరం గురించి అడిగామని అంటారు.. అయితే కేంద్ర బడ్జెట్లో ఆ ప్రస్తావనే కనిపించడం లేదని.. వైసీపీ ప్రభుతం ఏర్పడిన అనంతరం ఇప్పటి వరకూ కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్ట్ కోసం అందుకున్న నిధులు కేవలం రూ.5163.2 కోట్లు మాత్రమేనని గుర్తు చేశారు. ఇలా అయితే ఎప్పటికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అవుతుంది?..యమునకు ఉప నదులైన కెన్-బెత్వా ప్రాజెక్ట్ కోసం రూ.44వేల కోట్లు ప్రతిపాదనలుఈ సారి కేంద్ర బడ్జెట్లో ఉన్నాయి. దీని బట్టి చూస్తే కేంద్రం జలవనరుల రంగానికి సానుకూలంగా నిధులను కేటాయిస్తోంది. దీని బట్టి చూస్తుంటే.. పోలవరం కు నిధులు రాబట్టడంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని జనసేనాని వ్యాఖ్యానించారు.

కేంద్రం దగ్గర రాష్ట్ర అవసరాలను, ఇక్కడి ప్రజల ప్రయోజనాలను…. అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ ఏ విధంగా బహుళార్ధ సాధకమో వివరించి నిధులు తీసుకురావడంలో వైసీపీ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే 30.7 లక్షల ఎకరాలకు సాగు అవసరాలు, 28 లక్షల మందికి తాగు అవసరాలు తీరుతాయి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ ఎంపీలకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు పవన్ కళ్యాణ్.

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అంచనా వ్యయం రూ.47,725 కోట్ల మేరకు పెంచడానికి సాంకేతిక సలహా మండలి అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి నిధులు తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? నిధుల సాధనలో ఏపీ ప్రభుత్వ అలసత్వ వైఖరి చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తి అవుతుందో ఎవరి అంచనాలకు అందడం లేదని చలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.

Read Also:

క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ చట్టబద్ధతపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఆర్థిక కార్యదర్శి సోమనాథన్.. ఏమన్నారంటే?

శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
2 వేల నోట్లు మళ్లీ మార్చుకునే ఛాన్సుంటుందా.? ఆర్బీఐ ప్రకటన..
2 వేల నోట్లు మళ్లీ మార్చుకునే ఛాన్సుంటుందా.? ఆర్బీఐ ప్రకటన..
గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?
గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య,బాలకృష్ణ
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య,బాలకృష్ణ
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన యువకుడిపై ట్రోలింగ్.!
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన యువకుడిపై ట్రోలింగ్.!