ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామం జరిగింది. బీజేపీ కీలక నేత కన్నా లక్ష్మీనారాయణతో సమావేశమయ్యారు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. అది కూడా కన్నా ఇంటికెళ్లిమరీ ఏకాంత చర్చలు జరిపారు. ఇప్పుడు వీళ్లిద్దరి భేటీ ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
బీజేపీకి… మిత్రపక్షంగా కొనసాగుతోన్న జనసేన… ఆ పార్టీ కీలక నేత ఇంటికెళ్లి ప్రత్యేకంగా సమావేశంకావడం సెన్షేషన్‌గా మారింది. ఏపీ రాజకీయల్లోనే కొత్త చర్చకు దారితీసింది. వీళ్లిద్దరి భేటీపై అటు ఏపీ బీజేపీలోనూ… ఇటు జనసేనలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. కన్నా-నాదెండ్ల భేటీకి అసలు కారణం ఏమై ఉంటుందోనని మాట్లాడుకుంటున్నారు.
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నారు కన్నా. సోము టార్గెట్‌గా కొద్దిరోజులక్రితం హాట్ కామెంట్స్ కూడా చేశారు. ఇద్దరి మధ్యా పొసగక పోవడంతో సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు కన్నా. ఇప్పుడు, నాదెండ్ల వచ్చి… కన్నాతో ఏకాంత చర్చలు జరపడంతో పార్టీ మారతారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయ్.
కన్నా సీనియర్ లీడర్, ఆయనతో కలిసి పనిచేస్తామంటూ చెప్పుకొచ్చారు నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయాలపై చర్చించినట్లు తెలిపారు. మిగతా విషయాలు తమ అధినేత పవన్ కల్యాణ్‌తో చర్చించాల్సి ఉందంటూ సస్పెన్స్ క్రియేట్ చేశారు నాదెండ్ల.